OTT Movie : సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు ఎంగేజింగ్ గా, అదిరిపోయే ట్విస్టులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే ఈ జానర్ కోసం ఓటీటీలో వెతికే మూవీ లవర్స్ కోసమే ఓ మంచి మూవీ సజెషన్ ను తీసుకొచ్చాము. మరి ఆ మూవీ ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది? స్టోరీ ఏంటి? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి.
కథలోకి వెళ్తే…
కథ ముంబైలో నివసించే బాబీ గ్రెవాల్ (కంగనా రనౌత్) అనే యువతి చుట్టూ తిరుగుతుంది. బాబీ ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్, సినిమాల కోసం హీరోయిన్ల గొంతుకు డబ్బింగ్ చేస్తూ జీవిస్తుంది. ఆమె చిన్నతనంలో తల్లిదండ్రుల హత్యాయత్నం కారణంగా గాయపడి, అక్యూట్ సైకోటిక్ డిజార్డర్ తో బాధపడుతోంది. దీని వల్ల ఆమెకు హింసాత్మక ఊహలు, పారానాయిడ్ ఆలోచనలు, రియాలిటీకి సంబంధించిన సమస్యలు ఉంటాయి. ఆమె ఈ సమస్యలను దాటడానికి డాక్టర్ల దగ్గర థెరపీ తీసుకుంటూ, వాళ్ళిచ్చిన మందులు వాడుతుంది.
కానీ ఆమె విచిత్రమైన ప్రవర్తన, “జడ్జ్‌మెంటల్” స్వభావం ఆమె జీవితాన్ని మరింత సమస్యలమయం చేస్తాయి. కాగా బాబీ తన ఇంటిని అద్దెకు ఇస్తుంది. ఒక రోజు కేశవ్ (రాజ్‌కుమార్ రావ్), రీమా (అమీ శర్మ) అనే కొత్తగా పెళ్ళయిన జంట ఆ ఇంట్లో అద్దెకు దిగుతారు. కేశవ్ ఒక ఫోటోగ్రాఫర్, రీమా ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. బాబీ కేశవ్ కు అట్రాక్ట్ అవుతుంది. కానీ అతని ప్రవర్తనపై అనుమానం కలుగుతుంది. ఆమె మానసిక సమస్యల కారణంగా కేశవ్ ఒక సీరియల్ కిల్లర్ అని ఊహించుకుంటుంది అంతేకాదు అతని గతంలో జరిగిన ఒక హత్యతో అతన్ని ముడిపెడుతుంది.
కథలో ఒక ట్విస్ట్‌తో ఒక హత్య జరుగుతుంది. బాబీ దాని వెనుక కేశవ్ ఉన్నాడని నమ్ముతుంది. ఆమె అతన్ని ట్రాక్ చేయడం, అతని గురించి ఆధారాలు సేకరించడం ప్రారంభిస్తుంది. దీంతో ఆమె మెంటల్ గా మరింత డిస్టర్బ్ అవుతుంది. నెక్స్ట్ కథ లండన్‌కు మారుతుంది. ఇక్కడ బాబీ ఒక థియేటర్ ప్రొడక్షన్‌లో “రామాయణం” ఆధారంగా పని చేస్తుంది. కేశవ్ తో ఆమె గతం తిరిగి ఆమెను వెంటాడుతుంది. ఆమె సీత, రాముడు, లేదా రావణుడిగా తనను తాను ఊహించుకుంటుంది. అయితే కేశవ్ గతం, హత్యల వెనకున్న సీక్రెట్స్ తరువాత ఒక్కొక్కటిగా రివీల్ అవుతాయి. ఇంతకీ కేశవ్ గతం ఏంటి? ఆ హత్యకు అతనికి సంబంధం ఏంటి? హీరోయిన్ ఊరికే ఊహించుకుంటుందా? అదంతా రియల్ గా జరిగిందా? అనేది స్టోరీ.
Read Also : గురువు గారి రాసలీలలు … తీగలాగితే డొంకంతా కదిలే …
ఏ ఓటీటీలో ఉందంటే?
2019లో హిందీ భాషలో విడుదలైన బ్లాక్ కామెడీ-సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘జడ్జ్‌మెంటల్ హై క్యా’ (Judgementall Hai Kya). ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో రూపొందింది ఈ మూవీ. రాజ్‌కుమార్ రావ్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో నటించారు. అమీ శర్మ, హుస్సేన్ దలాల్, బోమన్ ఇరానీ, జిమ్మీ షేర్గిల్ సహాయక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రం 2019 జూలై 26న థియేటర్లలో విడుదలైంది. బాక్స్ ఆఫీసు దగ్గర పర్లేదు అన్పించిన ఈ మూవీ ZEE5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.