E-Paper
Advertisement

Prabhas Kalki 2898 AD Song Update: ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఫస్ట్ సాంగ్ వచ్చేస్తోంది

Prabhas Kalki 2898 AD Song Update: ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఫస్ట్ సాంగ్ వచ్చేస్తోంది
Advertisement

Prabhas Kalki 2898 AD First Single Releasing Date: ప్రస్తుతం సినీ ప్రియులు ఎంతో ఉత్కంఠగా ఎదరుచూస్తున్న టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ ఒకటి. ఈ మూవీపై అభిమానుల్లోనే కాదు.. సినీ ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే ఈ చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్‌లో చూపించబోతున్నాడు.

అయితే ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి పలు అప్డేట్లతో మేకర్స్ హైప్ క్రియేట్ చేశారు. వారానికో సర్‌ప్రైజ్ అందించి అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. ఇక ఇదివరకే రిలీజ్ అయిన పోస్టర్లు ఓ ఎత్తు అయితే.. ప్రభాస్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ మరొక ఎత్తు. ఆ గ్లింప్స్‌ చూసిన వారు మాత్రం.. ప్రభాస్ ఏంట్రా బాబు హాలీవుడ్ రేంజ్ హీరోలా ఉన్నాడు అన్నవారు లేకపోలేదు.

Advertisement

ఇటీవలే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఇక రిలీజ్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ జోరు పెంచారు. వరుస అప్డేట్‌లు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘బుజ్జ’ పేరుతో ఓ వీడియోను రిలీజ్ చేశారు. అందులో యంత్రంతో ప్రభాస్ .. అలాగే మూవీ యూనిట్ మాట్లాడేటట్లు చూపించారు. అయితే ఆ యంత్రానికి నటి కీర్తి సురేస్ వాయిస్‌ ఓవర్ అందించింది.

Also Read: భైరవ.. బుజ్జి వచ్చేసిందిరోయ్.. కీర్తి సురేష్ అదరగొట్టింది

Advertisement

అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ తరుణంలో మరొక వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ నుంచి మరొక అదిరిపోయే అప్డేట్ వచ్చేస్తుందని తెలుస్తోంది. ఇందులోని ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ మేరకు ‘కల్కి 2898 ఏడీ’ ఫస్ట్ సాంగ్‌ను మే 22న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఆ సాంగ్ ఎలా ఉండబోతుందో అని ఉత్కంఠగా చూస్తున్నారు.

ఇకపోతే ఈ మూవీలో స్టార్ కాస్ట్ నటిస్తున్నారు. బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తుండగా.. దీపికా పదుకొనే, దిశా పటానీలు నటీమణులుగా కనిపించనున్నారు. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ ప్రత్యేక పాత్రలో దర్శనమివ్వనున్నారు. టాలీవుడ్ హీరో రానా కూడా కీలక పాత్ర చేస్తున్నాడు. వీరితో పాటు మరికొందరు కూడా కనిపించనున్నట్లు తెలుస్తోంది

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×