BigTV English

Violence in Kyrgyzstan: కిర్గిస్థాన్‌లో ఏం జరుగుతోంది..? ఆందోళనలో పేరెంట్స్, ఛానెళ్లకు వీడియోలు..

Violence in Kyrgyzstan: కిర్గిస్థాన్‌లో ఏం జరుగుతోంది..? ఆందోళనలో  పేరెంట్స్, ఛానెళ్లకు వీడియోలు..

Violence in Kyrgyzstan: కిర్గిస్థాన్‌లో అల్లర్లు కంటిన్యూ అవుతున్నాయా? ఎందుకు తెలుగు స్టూడెంట్స్ బెంబేలెత్తున్నారు? అక్కడ పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదా? తమ హాస్టల్ వదిలి బయటకు రావద్దని విద్యార్థులకు అక్కడి భారత రాయబార కార్యాలయం ఎందుకు సూచించింది? కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? వారం రోజుల కంటే ఇప్పుడు పరిస్థితి మెరుగ్గా ఉందా? ఇవే ప్రశ్నలు విద్యార్థుల తల్లిదండ్రులను వెంటాడుతున్నాయి. చివరకు ఆందోళనకు గురవుతున్నారు.


దేశంలోనే కాదు.. విదేశాల్లోనూ నిరుద్యోగ సమస్య వెంటాడుతోంది. దీన్ని అదుపు చేయలేక చాలా దేశాల ప్రభుత్వాలు చేతులెత్తేస్తున్నాయి. దీనికి ఏ ఒక్క దేశం మినహాయింపు కాదు. తాజాగా కిర్గిస్థాన్‌లో విదేశీ విద్యార్థులపై జరుగుతున్న దాడులే ఇందుకు ఉదాహరణ. బిష్కెక్‌లోకి మెడికల్ కళాశాల్లో దక్షిణాసియాకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో చదువుకుంటున్నారు. ఎంబీబీఎస్ చదువుకు తక్కువ ఖర్చులో పూర్తి కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో ప్రతీ ఏటా అక్కడికి వెళ్లే విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

భారత్‌లోని తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో అక్కడకు వెళ్లారు. విదేశీ వ్యవహారాల శాఖ లెక్కల ప్రకారం దాదాపు 15,000 వేల మంది భారత విద్యార్థులు అక్కడున్నారు. వీరితో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్ స్టూడెంట్స్ అధికంగానే ఉన్నారు. ఓ వైపు చదువుతూ మరోవైపు పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తున్నారు. తక్కువ వేతనాలకు పని చేస్తుండడంతో స్థానికంగా ఉండే యువతకు నిరుద్యోగ సమస్య తీవ్రమైంది.


Also Read: Mob Violence in Kyrgyzstan : కిర్గిస్తాన్ లో ఆగని హింస.. మళ్లీ పెరిగిన దాడులు

దక్షిణాసియా స్టూడెంట్స్ వెళ్లే ఓ రెస్టారెంట్ వద్ద వారం కిందట గొడవ జరిగింది. ఈ క్రమంలో పాకిస్థాన్, బంగ్లా విద్యార్థులపై కిర్గిస్తాన్ యువకులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణ కాస్త తీవ్రరూపం దాల్చింది. దీంతో విద్యార్థులు ఉంటున్న కాలేజీ హాస్టల్స్‌కి వెళ్లి విద్యార్థులపై దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. దాడులకు పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఫుడ్ కోసం బయటకు వెళ్తే ప్రాణాలు పోయే పరిస్థితి నెలకొందని అక్కడున్న తెలుగు విద్యార్థులు మొరపెట్టుకుంటున్నారు. అయితే పరిస్థితి అదుపులోనే ఉందన్నది విదేశాంగశాఖ మాట. కానీ అక్కడ పరిస్థితి భిన్నంగా ఉందని తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు తెలుగు విద్యార్థులు. ఈ సందర్భంగా కొన్ని వీడియోలను షేర్ చేశారు. అంతేకాదు మహిళా విద్యార్థులపై లైంగిక దాడులు చేస్తున్నారని తెలిపారు.

Also Read: HIV positive prostitute arrest: అమెరికాను బయటపెట్టిన ఆ మహిళ, భయం గుప్పిట్లో వందల మంది

తామేమీ చేయాలంటూ ఫోన్ చేసిన విద్యార్థులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట భారత రాయబార కార్యాలయ సిబ్బంది. తమను ఇక్కడి నుంచి తరలించాలని టీవీ ఛానెళ్లతో మొరపెట్టుకుంటున్నారు విద్యార్థులు. పరిస్థితిని గమనించిన పాకిస్థాన్ ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి విద్యార్థులను తరలిస్తోందని అంటున్నారు. తమను కూడా వీలైనంత త్వరగా ప్రభుత్వం స్వస్థలాలకు తరలించాలని వేడుకుంటున్నా రు  తెలుగు రాష్ట్రాల విద్యార్థులు.

నిరుద్యోగ సమస్య ఇండియాలోనూ లేకపోలేదు. ముఖ్యమైన సిటీల్లో చదువుకున్న యవత, ఓ వైపు స్టడీస్ కొనసాగిస్తూనే మరోవైపు పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ జాబితాలో విదేశీ విద్యార్థులు కూడా ఉన్నారు. జనాభా తక్కువున్న ఆదేశంలో ఇలా జరిగితే, ఇండియా పరిస్థితి ఏంటన్నది అసలు ప్రశ్న.

Tags

Related News

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Big Stories

×