E-Paper
Advertisement

Kalki 2898 AD Stunt Making Video: కల్కి నుంచి మరో సర్‌ప్రైజ్.. యాక్షన్ సన్నివేశాల మేకింగ్ వీడియో రిలీజ్!

Kalki 2898 AD Stunt Making Video: కల్కి నుంచి మరో సర్‌ప్రైజ్.. యాక్షన్ సన్నివేశాల మేకింగ్ వీడియో రిలీజ్!
Advertisement

Kalki 2898 ad Stunt Making Video Out: ప్రభాస్ నటించిన కల్కి బాక్సాఫీసు బద్దలు కొడుతోంది. ఎవరూ కనీ వినీ ఎరుగని రితిలో దుమ్ము దులిపేస్తుంది. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా తొలి రోజు రూ.191.5 కోట్ల కలెక్షన్లను నమోదు చేసింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడా జోరు తగ్గలేదు. ఫస్ట్ నుంచి ఎలాంటి హవా కొనసాగించిందో ఇవాళ్టికి అలానే ఉంది.

తాజాగా ఈ మూవీ రూ.1000 కోట్లు క్రాస్ చేసి అబ్బురపరచింది. ఇక ఇప్పుడు రూ.1100 కోట్ల వైపు పరుగులు పెడుతుంది. ఈ మూవీ ఇంతటి సక్సెస్‌తో చిత్రబృందం ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంది. ఇందులో భాగంగానే ఈ సినిమా నుంచి ఒక్కో అప్డేట్‌ వదులుతుంది. ఇప్పటికే ఈ మూవీ రూ.1000 కోట్లు క్రాస్ చేసిన సందర్భంగా స్పెషల్ పోస్టర్లు రిలీజ్ చేసిన మూవీ యూనిట్ తాజాగా ఈ మూవీలోని యాక్షన్ సన్నివేశాల మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది.

Advertisement

ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండీ లాంగ్ తన క్రియేటివిటీతో సినిమా రేంజ్‌నే మార్చేశాడు. కల్కిలో విజువల్ ఎఫెక్ట్స్ ఓ ఎత్తయితే.. యాక్షన్ సన్నివేశాలు మరో ఎత్తనే చెప్పాలి. ముఖ్యంగా ప్రభాస్, అమితాబ్ బచ్చన్‌ల మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా ఉన్నాయి. మరి అలాంటి స్థాయి యాక్షన్ సన్నివేశాలను అందించి సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాడు ఆండి లాంగ్.

Also Read: కల్కి నుంచి స్పెషల్ వీడియో.. ప్రభాస్ తేజస్సు చూశారా.. ఎలా మెరిసిపోతుందో

Advertisement

తాజాగా రిలీజ్ చేసి యాక్షన్ సీన్ల మేకింగ్ వీడియో ప్రకారం.. ఒక యాక్షన్ సీన్‌ను ఎలా తీశారు అనేది ఈ వీడియోలో చూపించారు. ఇందులో అమితాబచ్చన్ యాక్షన్ సీన్లను ఏవిధంగా చిత్రీకరించారు, అలాగే దీపికా పదుకొనే, ప్రభాస్‌తో ఫైట్ సీన్లను ఎలా తీశారు అనేది చూపించారు. ఇలా మొత్తంగా ఆండి లాంగ్ తన క్రియేటివి అండ్ స్టంట్లతో క్యారెక్టర్లకు తగ్గట్టుగా యాక్షన్ సీన్లను అందించి అదరగొట్టేశాడనే చెప్పాలి. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ మేకింగ్ వీడియో చూసి ఎంజాయ్ చేయండి.

 

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×