BigTV English

6 Months Baby: దారుణం.. ఊయలలో ఉన్న 6 నెలల చిన్నారిపై తాత అత్యాచారం..!

6 Months Baby: దారుణం.. ఊయలలో ఉన్న 6 నెలల చిన్నారిపై తాత అత్యాచారం..!

Six Months old Baby Raped in Vizianagaram: ఈ సమాజం ఎటు వెళ్తోంది? కామ కోరికలను తీర్చుకునేందుకు మృగాడు ఆడదాని కోసం వేటాడుతున్నాడు. అవసరమైతే వెంటాడి చంపేస్తున్నాడు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో ఎనిమిదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటనలో ఇంకా బాలిక మృతదేహం దొరకలేదు. నాలుగురోజులైనా కేసులో పురోగతి లేదు. ఆ దారుణాన్ని మరువక ముందే ఆర్నెలల పసికందుపై మరో దారుణం జరిగింది. వరుసకు తాత అయిన వ్యక్తి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది. ఈ ఘటన విజయనగరం జిల్లాలో వెలుగు చూసింది.


బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు.. రామభద్రాపురం మండలంలో ఈ ఘటన జరిగింది. చిన్నారిని తల్లి ఊయలలో వేసి గ్రామంలో ఉన్న కిరాణా షాపుకు నిత్యవసరాల కోసం వెళ్లింది. అదే సమయంలో నార్లవలస గ్రామానికి చెందిన ఎరకన్న దొర ఆ ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేరన్న విషయాన్ని గమనించి.. పసికందుపై కన్నేశాడు. అభం శుభం తెలియని చిన్నారిపై అత్యాచారం చేసి కామవాంఛ తీర్చుకున్నాడు. ఊయలలో ఉన్న చిన్నారి గట్టిగా ఏడవడంతో.. అక్క అక్కడికి వెళ్లి చూసింది. రక్తస్రావంలో కనిపించడంతో వెంటనే తల్లికి విషయం చెప్పింది.

Also Read: ఎనిమిదేళ్ల చిన్నారి మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. అత్యాచారం చేసి హత్య చేసిన ముగ్గురు మైనర్లు!


చిన్నారి తల్లి, గ్రామస్తులు నిందితుడిని పట్టుకునేందుకు వెంబడించగా.. అతను పరారయ్యాడు. రక్తస్రావంతో.. నొప్పితో అల్లాడుతున్న చిన్నారిని బాడంగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం విజయనగరంలోని ఘోర ఆస్పత్రికి తరలించినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారన్నారు. స్థానికులు, చిన్నారి తల్లి నుంచి వివరాలు సేకరించి.. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. నార్లవలసలో అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

Tags

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×