E-Paper
Advertisement

Prabhas Kalki 2898 Ad Second Trailer: ‘కల్కి 2898ఏడీ’ సెకండ్ ట్రైలర్ లీక్.. 1.32 నిమిషాల రన్‌టైంలో ఫైట్లే ఫైట్లు..!

Prabhas Kalki 2898 Ad Second Trailer: ‘కల్కి 2898ఏడీ’ సెకండ్ ట్రైలర్ లీక్.. 1.32 నిమిషాల రన్‌టైంలో ఫైట్లే ఫైట్లు..!
Advertisement

Prabhas Kalki 2898 Ad Second Trailer Leaked: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీపై హైప్ మామూలుగా లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా కల్కి మూవీ పేరే.. ఎక్కడ విన్నా కల్కి మూవీ విజువల్ ఎఫెక్ట్సే. అదీగాక ఈ మూవీ రిలీజ్‌కు ఇంకా కొద్ది రోజులు ఉండటంతో ఏ చిన్న ఫొటో, వీడియో లీక్ అయినా ఇట్టే వైరల్ అయిపోతుంది. అంతేకాకుండా మూవీ మేకర్స్ కూడా అదే లెవెల్లో చిన్న చిన్న అప్డేట్‌లు ఇస్తూ మరింత బజ్ క్రియేట్ చేస్తున్నారు.

అయితే ఇటీవలే కల్కి మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేయగా యూట్యూబ్‌లో రికార్డుల వ్యూస్, లైక్స్‌తో దూసుకుపోయింది. ముఖ్యంగా హాలీవుడ్ రేంజ్ మార్వెల్ మూవీ మాదిరిగా ట్రైలర్ ఉండటంతో అందరి కళ్లు ఈ మూవీపైనే పడ్డాయి. అదీగాక రీసెంట్‌గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్టార్ హీరో హీరోయిన్లు సందడి చేసిన తీరుకు సినీ అభిమానులు ఫిదా అయిపోయారనే చెప్పాలి.

Advertisement

Also Read: కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్.. అందరి కళ్లు దీపికా చేతి వైపే.. ఎందుకో తెలుసా.. ?

అయితే ఇదంతా ఒకెత్తయితే ఈ మూవీ నుంచి సెకండ్ ట్రైలర్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సెకండ్ ట్రైలర్‌ను మూవీ రిలీజ్‌కు కొద్ది రోజుల ముందు రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సెకండ్ ట్రైలర్‌కు సంబంధించి ఓ లీక్ బయటకొచ్చి నెట్టింట వైరల్ అవుతోంది. అలా లీక్ అయిన చిన్న వీడియో ప్రకారం.. ఈ సెకండ్ ట్రైలర్ వీడియోలో విజువల్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఫస్ట్ ట్రైలర్‌లో చూపించని భారీ సీన్లను ఈ సెకండ్ ట్రైలర్‌లో చూపించనున్నట్లు ఈ లీక్ అయిన వీడియో చూస్తే అర్థం అవుతోంది.

Advertisement

కాగా ఈ సెకండ్ ట్రైలర్‌లో మృణాల్ ఠాకూర్ కూడా కనిపించి కనువిందు చేసింది. అందులో మృణాల్ కడుపులో ఒక లైట్ స్పీడ్‌గా వస్తున్న విజువల్ అయితే మరింతగా అదిరిపోయింది. అలాగే ఫైట్ సీన్లు కూడా అత్యద్భుతంగా ఉన్నాయి. అయితే దీని బట్టి చూస్తుంటే.. మృణాల్ ఇందులో కల్కి తల్లి పాత్ర అయిన సుమతి పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ సెకండ్ ట్రైలర్ లీక్ అయి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. కాగా ఈ చిత్రం జూన్ 27న గ్రాండ్‌గా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×