BigTV English

Madhavi: రగులుతుంది మొగలి పొద హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు అస్సలు ఎలా మారిపోయిందో చూడండి

Madhavi: రగులుతుంది మొగలి పొద హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు అస్సలు ఎలా మారిపోయిందో చూడండి

Madhavi: మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఖైదీ సినిమాను మర్చిపోవడం ఏ మెగా ఫ్యాన్ వలన కానీ పని. చిరంజీవిని స్టార్ గా చేసింది ఆ సినిమానే. ఇక ఆ సినిమాలో చిరంజీవి సరసన మెరిసిన హీరోయిన్ మాధవి గుర్తుందా.. ? ఆమె కూడా ఏం నార్మల్ హీరోయిన్ కాదు. అప్పట్లోనే స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. బాల చందర్ దర్శకత్వంలో తెరకెక్కిన మరో చరిత్ర సినిమాతో ఆమె ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.


డస్కీగా ఉన్నా కూడా చూపు తిప్పుకోనివ్వని అందం మాధవి సొంతం. అప్పట్లో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది మాధవి. ఆమె అసలు పేరు విజయలక్ష్మీ. అప్పటికే ఎంతోమంది లక్ష్మీలు ఇండస్ట్రీలో ఉండడంతో దాసరి నారాయణరావు ఆమె పేరును మాధవిగా మార్చారు. గ్లామర్ రోల్స్ అయినా.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అయినా మాధవి తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసేది. ఎక్కువగా మాధవి.. చిరంజీవితోనే కలిసి నటించింది.

ప్రాణం ఖరీదు, ఖైదీ, ఉరికిచ్చిన మాట, చట్టానికి కళ్లు లేవు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య,సింహపురి సింహం,చట్టంతో పోరాటం, దొంగ మొగుడు, బిగ్ బాస్.. వీటిన్నింటిలో చిరుతో రొమాన్స్ చేసింది మాధవి. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. మాతృదేవో భవ సినిమా మరో ఎత్తు. మాధవి కెరీర్ బెస్ట్ గా ఈ సినిమాను చెప్పుకోవచ్చు. ఈ చిత్రంలో భర్త చనిపోయాక.. తాను క్యాన్సర్ తో చనిపోతాను అని తెలుసుకున్న ఒక తల్లి.. తన పిల్లలను అనాధులుగా మారకుండా.. దత్తత ఇవ్వడానికి సిద్ధపడుతుంది. ఆ తల్లి పాత్రలో మాధవి నటించింది అనడం కన్నా జీవించింది అని చెప్పాలి.


వేణువై వచ్చాను భువనానికి.. గాలినై పోతాను గగనానికి సాంగ్ లో ఆమె నటన ఇప్పటికీ అభిమానుల కళ్ళలో మెరుస్తూనే ఉంటుంది. ఈ పాత్రకు ఆమె ఉత్తమనటిగా ఫిలింపేర్ అవార్డును కూడా అందుకుంది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే 1996 లో వ్యాపారవేత్త రాల్ఫ్ శర్మను వివాహమాడింది. పెళ్లి తరువాత ఇండస్ట్రీకి దూరమైన మాధవి భర్తతో పాటే న్యూజెర్సీకి వెళ్ళిపోయింది. ఈ జంటకు ముగ్గురు ఆడపిల్లలు. ఇక సోషల్ మీడియా వచ్చాకా మాధవి యాక్టివ్ గా మారింది.

నిత్యం కుమార్తెల ఫొటోలతో పాటు ఆమె ఫోటోలను కూడా షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. ప్రస్తుతం ఆమె వయస్సు 61. అప్పటి అందం మొత్తం కనిపించకుండా పోయింది. మాధవి చాలా మారిపోయింది. వృద్ధాప్య ఛాయలు ఆమె ముఖంలో కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆమెను చూస్తే మాధవి అని గుర్తుపట్టడం చాలా కష్టం. అయితే ఇప్పటికే ఆమె ఎంతో ఫిట్ గా ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఇక మాధవి కూతుళ్లు కూడా ఆమెను మించిన అందగత్తెలు. ముఖ్యంగా ఆమె రెండో కూతురు టిఫనీ అయితే సేమ్ మాధవి పోలికల్తోనే ఉంటుంది. ముగ్గురు కూతుళ్లను ఆమె ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు కానీ, లేకపోతే మాధవిలానే కూతుర్లు కూడా స్టార్స్ అయ్యేవారు. ప్రస్తుతం వీరి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×