E-Paper
Advertisement

Kalki 2898 AD Trailer: ‘కల్కి’ ఫ్యాన్స్ ఇక రెడీ అయిపోండ్రి.. ట్రైలర్ వచ్చేస్తోంది!

Kalki 2898 AD Trailer: ‘కల్కి’ ఫ్యాన్స్ ఇక రెడీ అయిపోండ్రి.. ట్రైలర్ వచ్చేస్తోంది!
Advertisement

Prabhas Kalki 2898Ad Trailer Release on June 1st Week: సినీ ప్రియుల్ని మరో అద్భుత ప్రపంచంలోకి తీసుకెళ్లుందుకు ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీ సిద్ధంగా ఉంది. ఎన్నో అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే నెల అంటే జూన్ 27న గ్రాండ్‌గా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే మూవీ మేకర్స్ వరుస అప్డేట్లు ఇస్తూ సినీ ప్రేక్షకాభిమానుల్ని ఆకట్టుకుంటున్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు సినిమాపై ఓ రకమైన హైప్ ఉండేంది. కానీ మొన్న నిర్వహించిన బుజ్జి ఎంట్రీ ఈవెంట్‌తో అంచనాలు మరో లెవెల్‌కి చేరిపోయాయి.

బుజ్జి లాంచ్ ఈవెంట్‌లో ప్రభాస్ మాస్ ఎంట్రీ గురించి చెప్పాల్సిన పనేలేదు. ప్రభాస్ తన కటౌట్‌కి సరిపడే బుజ్జి కారుతో స్పోర్ట్స్ రైడర్‌లా చక్కర్లు కొట్టాడు. ఆ విజువల్స్ అయితే హాలీవుడ్‌ రేంజ్‌లో ఉన్నాయనే చెప్పాలి. ఇక ప్రభాస్ కాస్ట్యూమ్ కూడా హాలీవుడ్ మార్వెల్ మూవీ హీరోస్ వలే చాలా నిండుగా సేఫ్టీ డ్రెస్సింగ్‌తో కనిపించి అదరగొట్టేశాడు. మరి ఈ బుజ్జి టీజర్ ఏ ఈ లెవెల్లో ఉంటే.. ట్రైలర్ ఇంకే లెవెల్లో ఉంటుందో అని అంతా చర్చించుకుంటున్నారు.

Advertisement

అయితే ట్రైలర్ అప్డేట్ గురించే ఇప్పుడంతా చర్చ. ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు. ఆ ట్రైలర్ ఎలా ఉంటుందో అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ట్రైలర్‌కి సంబంధించి ఓ వార్త మట్టుక తెగ వైరల్ అయిపోతుంది. కల్కికి ఇప్పుడున్న రెస్పాన్స్‌‌ను మరింత పెంచేవిధంగా ట్రైలర్‌ను మంచి యాక్షన్ మసాలా ముక్కలతో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట.

Also Read: ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ నార్త్ అమెరికా థియేటర్ రైట్స్ ఆ బ్యానర్‌కే సొంతం..

Advertisement

అంతేకాకుండా బుజ్జి టీజర్‌కు ఏ మాత్రం తక్కువ కాకుండా ట్రైలర్‌ను ఓ రేంజ్‌లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ట్రైలర్ రిలీజ్ డేట్‌పైనే అందరికళ్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ ట్రైలర్‌ను వచ్చే నెల జూన్ మొదటి వారంలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఎందుకంటే సినిమా రిలీజ్‌కు రెండు వారాల ముందు విడుదల చేస్తే ఎక్కువ మందికి చేరే అవకాశముందని ఆలోచిస్తున్నారట. మరి దీనిపై మేకర్స్ నుంచి త్వరలో అఫీషియల్ అప్డేట్ వస్తుందేమో చూడాలి. కాగా ఇందులో భారీ తారాగణం నటిస్తోంది. ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రానా, దీపికా పదుకొణే, దిశా పటానీ వంటి స్టార్ నటీనటులు కీలక పాత్రల్లో నటించబోతున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×