BigTV English

Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ నార్త్ అమెరికా థియేటర్ రైట్స్ ఆ బ్యానర్‌కే సొంతం..

Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ నార్త్ అమెరికా థియేటర్ రైట్స్ ఆ బ్యానర్‌కే సొంతం..

Prabhas – Kalki 2898 AD: ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD).. ఇప్పుడు అందరి కళ్లు ఈ సినిమా మీదే ఉన్నాయి. హాలీవుడ్ తరహా ఎలివేషన్లు, గ్రాఫిక్స్, ప్రభాస్ మాస్ అవతార్ అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీది ఆడియన్స్‌ మనస్సును దోచుకున్నవే. దర్శకుడు నాగ్ అశ్విన్ మరి ఈ తెలుగు చిత్రాన్ని హాలీవుడ్‌కి పోటీగా తెరకెక్కించాలని అనుకున్నాడో ఏమో కానీ తన క్రియేటివిటీతో సినీ ప్రేక్షకాభిమానుల్ని ఉక్కిరిబిక్కిరి చేసేలా ఉన్నాడు.


ఈ మూవీ అనౌన్స్ చేసినప్పుడు ఓ రకమైన ఆందోళన ఫ్యాన్స్‌లో ఉండేది. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబో సెట్ అవుతుందా? లేదా? అని. అంతేకాకుండా ప్రభాస్‌కు అప్పటికే ఎలాంటి హిట్లు కూడా లేవు. దీంతో ఫ్యాన్స్ చాలా కంగారు పడ్డారు. ఇక ఆ తర్వాత సలార్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అభిమానుల్లో ఎనర్జీ వచ్చింది. ఇక ప్రభాస్‌కు ఉన్న గండాలన్నీ తప్పిపోయాయ్.. ఇప్పుడు రాబోతున్న ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఎగిరిగంతులేశారు.

అదే టైంలో ‘కల్కి 2898 ఏడీ’ మూవీ నుంచి పోస్టర్లు, గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. దీంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా గ్లింప్స్‌లో ప్రభాస్‌ లుక్ చూసిన ఆడియన్స్ ఫిదా అయిపోయారు. హాలీవుడ్ రేంజ్ మార్వెల్ మూవీస్ హీరోలా కనిపించిన ప్రభాస్ అవతార్‌కి సెల్యూట్ కొట్టారు. ఇప్పటి వరకు ప్రభాస్‌ను అలాంటి మాస్ యాక్షన్ లుక్‌లో చూసిందేలేదని దర్శకుడిపై ప్రశంసలు కురిపించారు.


Also Read: కల్కి డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ ఓటిటీ సంస్థ?

దీంతో మూవీపై ఒక్కసారిగా అంచనాలు తారా స్థాయికి చేరిపోయాయి. ఇక ఈ చిత్రాన్ని వచ్చే నెల అంటే జూన్ 27న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు. ఈ తరుణంలో మూవీ నుంచి వరుస అప్డేట్‌లు ఇస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగానే ఓ సూపర్ పవర్ కార్‌ను ఆడియన్స్‌కు చూపించారు. ఈ కారును స్పెషల్‌గా చూపించేందుకు ఓ ఈవెంట్‌ను కూడా రీసెంట్‌గా నిర్వహించారు.

కాగా ఆ కారుకు బుజ్జి అని పేరు పెట్టారు. ఆ కారును ప్రభాస్ కల్కి సినిమాలో యుద్ద సన్నివేశాల్లో వాడనున్నాడు. దాన్ని స్పెషల్‌గా దర్శకుడు అండ్ టీం తయారుచేయించారు. దానికోసం దాదాపు రూ.7 కోట్లకు పైగా ఖర్చు అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీకి ఫుల్‌‌గా హైప్ క్రియేట్ అవ్వడంతో థియేటర్ రైట్స్‌పై ఆసక్తి నెలకొంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ మూవీ నార్త్ అమెరికా థియేటర్ హక్కులను ప్రముఖ బ్యానర్ సొంతం చేసుకుంది. ప్రత్యంగిరా సినిమాస్ అండ్ AA క్రియేషన్స్ ఈ మూవీ నార్త్ అమెరికా థియేటర్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

Tags

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Big Stories

×