E-Paper
Advertisement

Prabhas : స్టార్ హీరోయిన్ కి ఒక్క ఛాన్స్ ఇవ్వని ప్రభాస్… ఆమెకు తక్కువైంది ఇదేనట!?

Prabhas : స్టార్ హీరోయిన్ కి ఒక్క ఛాన్స్ ఇవ్వని ప్రభాస్… ఆమెకు తక్కువైంది ఇదేనట!?
Advertisement

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas ) ఇప్పటిదాకా చాలామంది స్టార్ హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అందులో కొంతమంది ప్రభాస్ తో ఆన్ స్క్రీన్ పై చేసిన రొమాన్స్ రూమర్లకు కూడా దారి తీసింది. అయితే ఆయనతో సినిమా చేసే అదృష్టానికి నోచుకోని హీరోయిన్లలో కొంతమంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఉన్నారు. అందులో సమంత (Samantha) కూడా ఒకరు. మరి ఈ బ్యూటీ కి ఏం తక్కువైంది? ఎందుకు ప్రభాస్ తో నటించే ఛాన్స్ రాలేదు? అని వివరాల్లోకి వెళ్తే….

సౌత్ క్వీన్ ను పక్కన పెట్టిన ప్రభాస్ 

Advertisement

సౌత్ క్వీన్ గా సమంత (Samantha)కి సౌత్ నుంచి నార్త్ దాకా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ బ్యూటీ కేవలం తెలుగు తమిళ భాషల్లోనే కాకుండా హిందీ చిత్ర సీమలో కూడా తన హవా కొనసాగిస్తుంది. ఇక ఇటు ప్రభాస్ అటు సమంత దశాబ్దాల నుంచి తెలుగు చిత్ర సీమలో హీరో హీరోయిన్లుగా పలు సినిమాలు చేస్తున్నారు. కానీ ఇప్పటిదాకా వీరిద్దరూ కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ఎప్పటినుంచో ఫ్యాన్స్ వీరిద్దరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ గురించి ఎదురు చూస్తున్నారు. కానీ తెలుగు మూవీ లవర్స్ ఆశ ఇంకా నెరవేరలేదు. దీనికి ఒక ప్రత్యేకమైన కారణం ఉందనే టాక్ నడుస్తోంది. అది హైట్.

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో మహేష్ బాబు (Mahesh Babu) సమంత హైట్ గురించి చెప్పిన డైలాగ్ ఇంకా తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండే ఉంటుంది. ‘భూమికి జానెడు లేవు.. ఏంటి నీ ఎదవ కాన్ఫిడెన్స్ ? నేను పక్కన నుంచుంటే ఫస్ట్ ఫ్లోర్ ను చూసినట్టు ఇలా చూస్తున్నావ్’ అంటూ ‘దూకుడు’ సినిమాలో చెప్పిన డైలాగ్ ప్రభాస్ విషయంలోనూ వినిపిస్తోంది. ప్రభాస్ ఆరడుగులు ఉంటే సమంత హైట్ 5.2 ఉంటుంది. ఈ హైట్ సమస్య కారణంగానే వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటిదాకా సినిమా రాలేదని అంటున్నారు. నిజానికి ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘సాహో’లో ముందుగా సమంతనే హీరోయిన్ గా అనుకున్నారని ప్రచారం జరిగింది. కానీ శ్రద్ధ కపూర్ అవకాశాన్ని కొట్టేసింది.

Advertisement

అయితే నిజానికి మహేష్ బాబు కూడా ఆరడుగుల అందగాడే. అయినప్పటికీ సమంతతో సినిమా తీసి మేకర్స్ బాగానే మేనేజ్ చేశారు. మరి ప్రభాస్, సమంత (Samantha) జోడికి నిజంగానే హైట్ అడ్డుగా మారిందా? లేదంటే ఇంకా ఏదైనా కారణం ఉందా ? అనేది తెలియాల్సి ఉంది. కాగా ప్రభాస్ ఇప్పటిదాకా అనుష్క, కాజల్, తమన్నా, త్రిష, శ్రియా, ఇలియానా, శ్రద్ధ కపూర్, కంగనా, దీపిక పదుకొనే, పూజ హెగ్డే వంటి స్టార్ హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇందులో ఆయన ఎక్కువగా అనుష్క కాజల్, త్రిష లతో కలిసి నటించారు. ఇక కాజల్, అనుష్కతో ప్రభాస్ ప్రేమాయణం నడిపించారనే రూమర్లు విన్పించాయి. అనుష్కతో అయితే ఏకంగా పెళ్లి, పిల్లల వరకు వెళ్ళింది యవ్వారం.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×