E-Paper
Advertisement

Prabhu Deva: ప్రభుదేవా ఇంట తీవ్ర విషాదం..

Prabhu Deva: ప్రభుదేవా ఇంట తీవ్ర విషాదం..
Advertisement

Prabhu Deva: ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రభుదేవా అమ్మమ్మ పుట్టమ్మని(97) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె నేడు మరణించారు. మైసూరులోని ఓ మారుమూల ప్రాంతంలో ఆమె జీవిస్తున్నారు. ఇక ఈ విషయం తెలియడంతో సుందరం సోదరులు హుటాహుటిన ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మైసూర్ బయల్దేరారు.

అమ్మమ్మను కడసారి చూసేందుకు ప్రభుదేవాతో పాటు అతడి అన్నాదమ్ములు చెన్నై నుంచి మైసూరు చేరుకున్నారు. మైసూరు మందకల్లి విమానాశ్రయానికి చేరుకున్న ప్రభుదేవా సోదరులు కారులో ధుర అనే మారుమూల గ్రామానికి చేరుకున్నారు. పుట్టమ్మని.. సుందరం మాస్టర్ భార్య మహాదేవమ్మ తల్లి. ధుర గ్రామ మాజీ ఉపాధ్యక్షుడు మహదేవప్ప, పుట్టమ్మని కుమార్తె అయినా మహాదేవమ్మను సుందరం మాస్టర్ వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కుమారులు.

Advertisement

ప్రభుదేవా సుందరం, రాజు సుందరం, నాగేంద్ర ప్రసాద్ సుందరం. ముగ్గురు డ్యాన్స్ మాస్టర్స్ గానే కొనసాగుతున్నారు. ప్రభుదేవాకు అమ్మమ్మ అంటే వల్లమాలిన అభిమానం. ఆమెతో అప్పుడప్పుడు ఫోటోలు దిగి సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇక అమ్మమ్మ మరణించింది అని తెలియగానే షూటింగ్స్ కూడా మానేసి.. హుటాహుటినా ఆమె కడసారి చూపు కోసం పరిగెత్తాడు. ఈ విషయం తెలియడంతో పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ప్రభుదేవా.. ఒకపక్క నటుడుగా ఇంకోపక్క డ్యాన్స్ మాస్టర్ గా కొనసాగుతున్నాడు. ప్రభుదేవా చేతిలో కొన్ని సినిమాలు ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమాలు రిలీజ్ కానున్నాయి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×