E-Paper
Advertisement

Dragon: డ్రాగన్ టైటిల్ కొట్టేసిన కుర్ర హీరో.. ఇప్పుడు ఎన్టీఆర్ నీల్ పరిస్థితి ఏంటి.. ?

Dragon: డ్రాగన్ టైటిల్ కొట్టేసిన కుర్ర హీరో.. ఇప్పుడు ఎన్టీఆర్ నీల్ పరిస్థితి ఏంటి.. ?
Advertisement

Dragon: దేవర సినిమాతో భారీ విజయాన్ని కాకపోయినా.. ఒక మోస్తరు విజయాన్ని సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్. రాజమౌళితో హిట్ అందుకున్నాక కూడా ఇలాంటి ఒక విజయం దక్కడం అంటే మాములు విషయం కాదు. రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేసి దేవరతో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా రికార్డ్ కలక్షన్స్ సృష్టిస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత ఎన్టీఆర్.. వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే.

ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో రెండు, మూడు సినిమాలు ఉన్నాయిం. అందులో ఒకటి ఎన్టీఆర్ నీల్ అయితే.. ఇంకొకటి వార్. ఈ రెండు సినిమాలపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మధ్యనే ఎన్టీఆర్ నీల్ సినిమాసెట్స్ పైకి వెళ్లిన విషయం తెల్సిందే. సలార్ 2 సినిమాను ఆపి మరీ ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ 31 ను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఎప్పటి నుంచో ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు ఏ రేంజ్ లో హల్చల్ చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Advertisement

ఎన్టీఆర్ లుక్ తో డ్రాగన్ టైటిల్ వేసి.. ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ టైటిల్ ను ఒక కుర్ర హీరో కొట్టేశాడు. లవ్ టుడే సినిమాతో తెలుగువారికి దగ్గరైన హీరో, డైరెక్టర్ ప్రదీప్ రంగనాధన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రదీప్ తన కొత్త  సినిమాను ఈ పండగకు అనౌన్స్ చేశాడు. స్టార్ డైరెక్టర్ అస్వత్ మారిముత్తు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

ఓ మై కడవులే అనే సినిమాతో కెరీర్ ను ప్రారంభించిన ఈ డైరెక్టర్.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు ప్రదీప్ తో రెండో సినిమాను డ్రాగన్ పేరుతో తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. నేడు ఈ సినిమాకు సంబంధించిన మూడు పోస్టర్లను మేకర్స్ రిలీజ్ చేసి.. అభిమానులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

డ్రాగన్ టైటిల్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఎంత అనుభందం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, ఇప్పుడు ఆ టైటిల్ ను ప్రదీప్ ఎగరేసుకుపోతే ఎన్టీఆర్ నీల్ సినిమా టైటిల్ కు ఇంకా ఎలాంటి టైటిల్ వస్తుందో అని ఆందోళన పడుతున్నారు. మరి ఎన్టీఆర్ నీల్ కు ఇంతకంటే మంచి టైటిల్ దొరుకుతుందేమో చూడాలి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×