BigTV English

RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ఎప్పటికీ నా ఫేవరెట్ సినిమా.. హాలీవుడ్ నటి ప్రశంసలు

RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ఎప్పటికీ నా ఫేవరెట్ సినిమా.. హాలీవుడ్ నటి ప్రశంసలు

RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ తెలుగు మేకర్స్ సత్తా ఏంటో ప్రపంచమంతా తెలిసేలా చేసింది. అంతే కాకుండా ఇండియాకు ఆస్కార్‌ను కూడా తెచ్చిపెట్టింది. ఇలా ‘ఆర్ఆర్ఆర్’ ఖాతాలో ఎన్నో రికార్డులు ఉన్నాయి. ఇక ఆస్కార్ వరకు వెళ్లడంతో ఈ సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్ మేకర్స్ అందరికీ తెలిసింది. రాజమౌళి పేరు హాలీవుడ్‌లో కూడా మారుమోగిపోయింది. ఎంతోమంది హాలీవుడ్ మేకర్స్.. ‘ఆర్ఆర్ఆర్’ తమకు చాలా నచ్చింది అని, ఫేవరెట్ అని వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆ లిస్ట్‌లోకి మరొక హాలీవుడ్ నటి వచ్చి జాయిన్ అయ్యింది.


అద్భుతమైన చిత్రం

హాలీవుడ్‌లోని సీనియర్ నటీమణుల్లో ఒకరు మిన్నీ డ్రైవర్. గత రెండు దశాబ్దాలుగా ఇంగ్లీష్ సినిమాల్లో నటిస్తూ గుర్తింపు సాధించుకున్న మిన్నీ.. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మిన్నీ డ్రైవర్.. ‘ఆర్ఆర్ఆర్’ గురించి ప్రస్తావించింది. ‘‘ఆర్ఆర్ఆర్ నా ఫేవరెట్. నా కొడుకుతో కలిసి ఆ సినిమా చూడడం నాకు చాలా ఇష్టం. మా ఇద్దరికీ అది ఎప్పటికీ నా ఫేవరెట్ సినిమా. ఆ సినిమా నిడివి మూడు గంటలు ఉంటుంది కానీ దానిని మేము ప్రతీ మూడు నెలలకు ఒకసారి చూస్తాము. ప్రపంచవ్యాప్తంగా తెరకెక్కిన అద్భుతమైన చిత్రాల్లో అది కూడా ఒకటి’’ అంటూ చాలా ఎగ్జైట్‌మెంట్‌తో షేర్ చేసుకుంది మిన్నీ డ్రైవర్.


Also Read: రాహా కపూర్‌కు రామ్ చరణ్ స్పెషల్ గిఫ్ట్, చూడగానే షాకయిన ఆలియా భట్.. అదేంటో తెలుసా?

కల్చర్ తెలుసుకోవాలి

‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి మాత్రమే కాదు.. ఇండియన్ కల్చర్ గురించి కూడా గొప్పగా మాట్లాడింది మిన్నీ డ్రైవర్. పంజాబ్‌కు చెందిన రోమీ గిల్ అనే చెఫ్‌తో మిన్నీకి మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని తానే స్వయంగా బయటపెట్టింది మిన్నీ. ‘‘నేను రోమీ గిల్‌తో తరచుగా మాట్లాడుతూ ఉంటాను. నాకు ఇండియాకు వెళ్లాలనుందని, అక్కడి కల్చర్‌ను తెలుసుకోవాలని ఉందని ఎప్పుడూ చెప్తుంటాను’’ అని చెప్పుకొచ్చింది. మిన్నీ డ్రైవర్ చివరిగా ‘ది సర్పెంట్ క్వీన్’ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసింది. ఇంగ్లాండ్‌కు చెందిన మహారాణి.. క్వీన్ ఎలిజిబెత్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన సిరీసే ‘ది సర్పెంట్ క్వీన్’.

రికార్డులు బ్రేక్

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్‌టీఆర్ మల్టీ స్టారర్ చేసిన చిత్రమే ‘ఆర్ఆర్ఆర్’. 2022లో విడుదలయిన ఈ సినిమా ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. ఇప్పటికే రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ ఓ రేంజ్‌లో హిట్ అవ్వడంతో దాని తర్వాత ఆయన చేసే సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ తెరకెక్కించి తనకు తానే సాటి అనిపించుకున్నారు రాజమౌళి. ఇప్పుడు మహేశ్ బాబుతో మూవీకి సిద్ధమవుతున్నారు. రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మూవీపై కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. 2025లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.

Related News

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big Stories

×