E-Paper
Advertisement

Anupama Parameswaran: మరొక కొత్త సినిమాతో అనుబ్యూటీ.. కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేయనున్న సామ్

Anupama Parameswaran: మరొక కొత్త సినిమాతో అనుబ్యూటీ.. కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేయనున్న సామ్

Anupama Parameswaran: కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ నటించిన రీసెంట్‌ మూవీ ‘టిల్లు స్క్వేర్’. ఈ మూవీతో అను బ్యూటీ ప్రేక్షకుల మనస్సులు దోచుకుంది. ఏ సినిమాలోనూ ప్రదర్శించని ఎక్స్‌పోజింగ్.. ఈ సినిమాలో దారబోసేసింది. కిస్ సీన్లతో రెచ్చిపోయింది. ఆమె ఈ లెవెల్లో పెర్ఫార్మెన్స్ ఇస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఒక్కసారిగా రొమాంటిక్ సీన్లలో కనిపించి అందరినీ షాక్‌‌కు గురిచేసింది.

అంతేకాకుండా ఆమె యాక్టింగ్ కూడా ఈ మూవీలో ఇరగదీసేసింది. దీంతో ఈ మూవీ బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను నమోదు చేసింది. అయితే ఈ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్ము.. ఇప్పుడు మరొక కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. ‘సినిమా బండి’ ఫేం ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తుంది.

అయితే ఈ ప్రవీణ్ కాండ్రేగుల ఎవరనే విషయానికొస్తే.. మూడేళ్ల కిందట ‘సినిమా బండి’ అనే మూవీతో వచ్చాడు. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో మంచి రెస్పాన్స్‌ను అందుకుంది. అయితే ఈ మూవీతోనే అతడు దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈ సినిమాకి ప్రముఖ జంట దర్శకులు రాజ్ అండ్ డీకేలు నిర్మాతలుగా ఉన్నారు.

Also Read: పెళ్లి పీటలెక్కనున్న మరో అందాల నటి.. ఫొటోస్ వైరల్!

కాగా ఇప్పుడు ఆ దర్శకుడు తన కెరీర్‌లో రెండో సినిమా తీయడానికి సిద్ధమయ్యాడు. ఈ మూవీకి సంబంధించిన పలు అప్డేట్లను సినీ ప్రపంచానికి చాటి చెప్పనున్నాడు. ఈ మూవీ నుంచి టైటిల్ అండ్ కాన్సెప్ట్ వీడియో గ్లింప్స్‌ని స్టార్ హీరోయిన్, రాజ్, డీకేల చేతులు మీదుగా రేపు సాయంత్రం 4.56 గంటలకు రిలీజ్ చేయనున్నారు.

ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించబోతుంది. ఆమెతో పాటు ‘జయ జయ జయ జయ హే’ ఫేమ్ మాలీవుడ్ నటి దర్శనా రాజేంద్రన్ ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయం అవుతోంది. సంగీత, రాగ్ మయూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీనివాసులు పి, విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గోపీ సుందర్ స్వరాలు సమకూరుస్తున్నారు. కాగా ఈ మూవీ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కబోతుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఎంతో సాహసోపేతంగా కూడా ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×