Big Stories

T20 World Cup 2024: ఐపీఎల్‌లో అదరగొడుతున్న పంత్.. అమెరికా విమానం ఎక్కడం ఖాయమే!

Rishabh Pant: ఇప్పుడు రిషబ్ పంత్ ఆటపై నెట్టింట పెద్ద చర్చ జరుగుతోంది. మళ్లీ ఆనాటి పంత్ వచ్చేశాడని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ పై జరిగిన మ్యాచ్ లో 43 బంతుల్లో 88 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అంతేకాదు ఆఖరి ఓవర్ లో 31 పరుగులు చేసి గుజరాత్ నుంచి విజయాన్ని లాగేశాడు.

- Advertisement -

త్వరలోనే టీ 20 ప్రపంచ కప్ ఆటగాళ్ల ఎంపిక జరగనుంది. దాంట్లో మొదట రిషబ్ పంత్ పేరు వినిపిస్తుందని అంతా అంటున్నారు. అమెరికా విమానం ఎక్కడం ఖాయమని కూడా అంటున్నారు. అంతేకాదు రాబోవు రోజుల్లో రోహిత్ శర్మ తర్వాత…టీమ్ ఇండియా కెప్టెన్ గా పంత్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. మహేంద్ర సింగ్ తరహాలో హెలికాఫ్టర్ షాట్లు కూడా గుజరాత్ మ్యాచ్ లో ఆడాడు. స్లో డెలివరీలతో ఇబ్బంది పెట్టాలని చూసిన మోహిత్ శర్మ బౌలింగుని ఊచకోత కోశాడు.

- Advertisement -

యాక్సిడెంట్ అయిన తర్వాత మళ్లీ ఇంటర్నేషనల్ మ్యాచ్ స్థాయిలో ఆడాలంటే ఎంతో మనోధైర్యం, ఆత్మ విశ్వాసం కావాలి. అలాంటిది చావు వరకు వెళ్లి వచ్చిన పంత్ మళ్లీ తిరిగి, గ్రౌండులో అడుగుపెట్టడమే కాదు, మునుపటికన్నా రెట్టించిన ఉత్సాహంతో ఆడటంతో అందరూ సంతోషిస్తున్నారు. ముఖ్యంగా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చాలా ఆనందంగా ఉన్నాడు. ఎందుకంటే టీమ్ లో అందరికన్నా పంత్ ఆటనే తనెక్కువ ఇష్టపడతాడు.

ఎప్పుడే సందర్భం వచ్చినా సరే, పంత్ ని గుర్తు చేసుకుంటాడు. ఒక సందర్భంలో మాట్లాడుతూ టీమ్ ఇండియాలో ఒకడు ఉండేవాడు. సిక్స్ లు కొట్టడంలో వాడిని మించినవాడు లేడని అన్నాడు. నిజానికి ఆ మాట, నేడు రుజువైంది. తను చేసిన 88 పరుగుల్లో 8 సిక్సు లే ఉన్నాయి. అంటే తను ఏ రేంజ్ లో సిక్సులు కొట్టాడో అర్థం చేసుకోవచ్చు.

Also Read: కొహ్లీ ఓపెనర్ గా రావాలి.. సౌరభ్ గంగూలి

మొత్తానికి టీ 20 వరల్డ్ కప్ కి పంత్ ఎంపిక పక్కా అని అంటున్నారు. మరి తనకి తోడుగా కేఎల్ రాహుల్, సంజు శాంసన్, ఉంటారా? అన్నది తేలాల్సి ఉంది. అన్నింటికన్నా మించి పంత్ కి ఇండియా కన్నా విదేశీ పిచ్ లపైనే మంచి రికార్డు ఉంది. అది కూడా రేపు పొట్టి ప్రపంచకప్ లో ఉపయోగపడుతుందని అంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News