BigTV English
Advertisement

Megha Akash: పెళ్లి పీటలెక్కనున్న మరో అందాల నటి.. ఫొటోస్ వైరల్!

Megha Akash: పెళ్లి పీటలెక్కనున్న మరో అందాల నటి.. ఫొటోస్ వైరల్!

Megha Akash Marriage News: ఈ ఏడాది సినీ ఇండస్ట్రీలో చాలానే ప్రేమ పెళ్లిళ్లు జరిగాయి. ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకుని పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అయితే లిస్ట్ చెప్పాలంటే చాలా పెద్దగానే ఉంటుంది. ఇక ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్న వారిలో తమన్నా, అదితి రావు హైదరితో సహా మరికొంత మంది నటీమణులు ఉన్నారు. అందులో యంగ్ అండ్ స్వీట్ బ్యూటీ మేఘా ఆకాష్ కూడా ఒకరు. ఇప్పుడు ఈ భామ మ్యారేజ్‌కు సంబంధించి ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.


ఎన్నో సినిమాల్లో తన అందం, నటనతో ప్రేక్షకుల్ని అలరించింది ఈ ముద్దుగుమ్మ. నితిన్, రవితేజ వంటి హీరోలతో నటించి మంచి గుర్తింపు అందుకుంది. అయితే ఈ బ్యూటీ మ్యారేజ్‌కు సంబంధించిన వార్తలు ఎప్పట్నుంచో వైరల్ అవుతున్నాయి. ఓ బడా బిజినెస్ మ్యాన్‌ను మేఘా ఆకాష్ మ్యారేజ్ చేసుకోబోతుందని వార్తలు చక్కర్లు కొట్టాయి.

అయితే ఇప్పుడు మళ్లీ ఆ వార్తలే సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి. అందుకు కూడా ఓ కారణం కూడా ఉందండోయ్. ఆమె ఉన్నట్టుండి.. ఒక్కసారిగా మెహిందీతో సాంప్రదాయ దుస్తుల్లోకి మారడమే అందుకు కారణం. అందమైన చీర కట్టుకుని.. మెహందీతో కొత్త పెళ్లి కూతురిలా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


Also Read: రేపు ఓటీటీలో సినిమాల జాతర.. టిల్లు స్క్వేర్‌తో సహా మరికొన్ని సినిమాలు..

అంతేకాకుండా ఆమె ఈ ఫోటోలను షేర్ చేస్తూ #weddingvibes అనే ట్యాగ్‌ను కూడా జోడించింది. దీంతో ఆమె పెళ్లి వార్తలు ఊపందుకున్నాయి. ఆమె ఓ బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకోబోతుందన్న వార్తలు నిజమేనని.. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ పెళ్లి పీటలెక్కబోతుందనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి.

అయితే అసలు విషయం తెలిసి అంతా సైలెంట్ అయ్యారు. ఇంతకీ ఏంటా అసలు విషయం అని అనుకుంటున్నారా?.. ఈ ఫొటోలు ఆమె పెళ్లికి ముందు జరిగిన వేడుకలలోని ఫొటోలు కాదని తెలిసింది. ఈ బ్యూటీ ఒక యాడ్ షూట్ చేసిందని.. ఆ షూట్ నుంచి కొన్ని ఫొటోలను ఆమె షేర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆమె వివాహం చేసుకోవడానికి రెడీగానే ఉందని.. కానీ ఈ ఫొటోలు మాత్రం పెళ్లికి సంబంధించిన ఫొటోలు కావని సమాచారం. దీంతో ఆమె పెళ్లి చేసుకుంటుందనే వార్తలకు చెక్ పడింది. ప్రస్తుతం ఈ భామ రెండు తెలుగు చిత్రాలను, ఒకటి తమిళ సినిమాను చేస్తుంది.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×