EPAPER

Mamitha Baiju : తెలుగు ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన ‘ప్రేమలు’ బ్యూటీ.. ఫ్యాన్స్ హర్ట్..

Mamitha Baiju : తెలుగు ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన ‘ప్రేమలు’ బ్యూటీ.. ఫ్యాన్స్ హర్ట్..

Mamitha Baiju : ఈ ఏడాది మలయాళ ఇండస్ట్రీ పంట పండింది. ఇండస్ట్రీలో వచ్చిన ప్రతి సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. అందులో ప్రేమలు సినిమా కూడా ఒకటి. ఈ సినిమాతో యూత్ క్రష్ గా మారిపోయింది మమితా బైజు . మొదటి సినిమాతోనే బాగా పాపులారిటీ సొంతం చేసుకుంది.. ఇటీవల ప్రేమలు అనే సినిమాతో తెలుగు , మలయాళం భాషలలో ఒక్కసారిగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. ఆమె నటనకు ఫిదా అయిన తెలుగు ఆడియన్స్ ఈమె తెలుగులో చేస్తే బాగుండు అని ఆశ పడ్డారు. కానీ పాప మాత్రం అందరికీ షాక్ ఇచ్చింది. తెలుగులో సినిమాలు తీయనని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.


మమిత బైజు గురించి ఈ మధ్య వార్తల్లో ఎక్కవగా వినిపిస్తుంది.. మొదటి సినిమాతో మంచి హిట్ టాక్ ను అందుకుంది.. తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పాప లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ఈమె ఫోటోలకు తెలుగు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తెలుగు హీరోల సరసన మమితాను చూడాలని ముచ్చటపడ్డారు. కానీ ఆ కోరిక కోరికలానే మిగిలిపోతుందని తెలుస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈ బ్యూటీ మలయాళ సినిమాలను లైన్లో పెట్టుకున్న విషయాన్ని చెప్పింది. ఇది విన్న ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. ఇక ఫ్యూచర్ లో అయిన తెలుగులో సినిమాలు చెయ్యాలని కోరుకుంటున్నారు. మరి తెలుగు ఫ్యాన్స్ కోరికను ఈమె తీరుస్తుందో లేదో చూడాలి..

ఇకపోతే ఈ మలయాళ కుట్టి ప్రేమలు 2 షూటింగ్ లో బిజీగా ఉంది. దీంతో పాటుగా తమిళ రీమేక్ సినిమా లో నటించే ఛాన్స్ కొట్టేసింది. గత ఏడాది నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘భగవంత్ కేసరి’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇందులో బాలయ్య కి కూతురుగా శ్రీలీల నటన అందరిని కట్టిపడేసింది. ఇప్పుడు ఈ మూవీని తమిళ్ లో రీమేక్ చేయబోతున్నారు. తమిళ దర్శకుడు హెచ్. వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ మూవీ లో శ్రీలీల క్యారెక్టర్ లో మమిత బైజు నటించగా, కాజల్ పాత్రలో పూజా హెగ్డే నటిస్తుందని సమాచారం. ఆ తరువాత వరుసగా మలయాళం సినిమాల్లో నటించనుంది. ఇక ఓ పక్క సినిమాలు, మరో పక్క యాడ్స్ తో మమిత బైజు దూసుకుపోతుంది అని చెప్పొచ్చు.. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.
ఆమె ఫొటోలే కాదు డ్యాన్స్ వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.. ఒక్క సినిమాతో కుర్రకారును తమ వైపు తిప్పుకుంది..


Related News

Shruti Haasan: ‘డెకాయిట్’ నుండి తప్పుకున్న శృతి హాసన్.. అదే కారణమా?

Jani Master: జానీ మాస్టర్ కు బెయిల్ రద్దు.. తల్లిని చూసైనా కోర్టు కనికరించలేదా..?

Tollywood Young Hero: పూరీనే రిజెక్ట్ చేసిన కుర్ర హీరో.. తప్పు చేశాడా.. తప్పించుకోవడానికి చేశాడా.. ?

Prabhas Hanu: ప్రభాస్, హను సినిమాకు ఓ రేంజ్‌లో హైప్.. ఓవర్సీస్ కోసం ఏకంగా అన్ని కోట్లు డిమాండ్?

Matka Movie: లేలే రాజా.. ఏముందిరా.. మనోహరీ.. సాంగ్ అదిరింది అంతే

Sankranti 2025: సంక్రాంతి బరిలో దిగుతున్న పెద్ద సినిమాలు ఇవే.. ఎవరిది పై చేయి..?

Srivani: సీరియల్ నటి శ్రీవాణికి యాక్సిడెంట్… రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు

Big Stories

×