BigTV English

SIT probe temporarily stopped: తిరుమల లడ్డూ వివాదం, సిట్ దర్యాప్తు బ్రేక్ వెనుక.. అసలేం జరిగింది?

SIT probe temporarily stopped: తిరుమల లడ్డూ వివాదం, సిట్ దర్యాప్తు బ్రేక్ వెనుక.. అసలేం జరిగింది?

SIT probe temporarily stopped: తిరుమల లడ్డూపై దర్యాప్తుకు ఎందుకు బ్రేక్ ఇచ్చింది? కూటమి నిర్ణయం వెనుక అసలేం జరిగింది? దీనిపై సుప్రీంకోర్టు అడ్వకేట్లు ఏమన్నారు? ప్రభుత్వానికి వచ్చిన ఇన్‌ఫుట్స్ ఏంటి? నేతలు ఎందుకు నోరెత్త లేదు? తాత్కాలికంగా బ్రేక్ ఇవ్వడం వెనుక అసలేం జరిగిందన్న డీటేల్స్‌లోకి వెళ్దాం.


తిరుమల లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ మాదిరిగా న్యాయమూర్తులపై ఎలాంటి కామెంట్స్ చేయకుండా చర్యలు చేపట్టింది. ఈసారి ప్రభుత్వం వైపు ఎలాంటి తప్పు లేకుండా చూస్తోంది.

సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో అదేరోజు సాయంత్రం పార్టీకి చెందిన కొంతమంది అధికార ప్రతినిధులకు కీలక సూచనలు చేశారట సీఎం చంద్రబాబు. న్యాయస్థానం వ్యాఖ్యలపై కాకుండా వాటిపై ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు ఎత్తవద్దని సూచన చేశారు. రెండురోజులుగా టీడీపీ నేతలు, అధికార ప్రతినిధులు సైతం ఈ అంశంపై సైలెంట్ అయిపోయారు.


బుధవారం ప్రభుత్వంలోని కీలక అధికారులు, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, సిట్ అధికారి, సుప్రీంకోర్టుకి చెందిన లీగల్ టీమ్‌తో ఆన్‌లైన్‌ ద్వారా సమావేశమయ్యారట సీఎం చంద్రబాబు. చాలా విషయాలు ప్రస్తావనకు వచ్చాయట.

ALSO READ:  సీఎం గారూ.. నా కొడుకును బ్రతికించండి, ఓ తల్లి కన్నీటి వ్యథ

తిరుమల లడ్డూ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉన్నందున తీర్పు వచ్చేవరకు సిట్ దర్యాప్తుకు తాత్కాలికంగా విరామం ఇస్తే బెటరని సలహా ఇచ్చారట. ఈ సమయంలో దర్యాప్తు ఆపితే లేనిపోని అనర్థాలు వస్తాయని కొంతమంది ప్రస్తావించారట. సిట్ దర్యాప్తు తాత్కాలికంగా ఆపితే అత్యున్నత న్యాయస్థానానికి గౌరవం ఇచ్చినట్టు అవుతుందని అన్నారట.

రెండురోజులు దర్యాప్తు ఆపితే పోయేదేమీ లేదని అన్నారట. సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున ఆర్గ్యుమెంట్ మరింత బలంగా చేస్తే బాగుండేదని, చాలా వీక్‌గా ఉందని కొందరి ప్రస్తావనకు తెచ్చారట. అటువైపు నుంచి బలమైన వ్యక్తులు పిటిషన్ వేసిన నేపథ్యంలో ప్రభుత్వం తరపున వాదనలూ అదే వేగంతో ఉంటే బాగుండేదని చెప్పుకొచ్చారట.

సిట్ దర్యాప్తు వేసిన తర్వాత సీఎం చేసిన కామెంట్స్‌పై న్యాయస్థానం దృష్టి పెట్టిందని అంటున్నారు. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వ విషయాన్ని ప్రస్తావించారట కొందరు అడ్వకేట్లు. విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ నరసింహారెడ్డి ఆధ్వరంలో తెలంగాణ ప్రభుత్వ వేసిన జ్యుడీషియల్ విచారణ వేసింది. విచారణ జరుగుతున్న సమయంలో జస్టిస్ నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడటాన్ని తప్పుబట్టింది సుప్రీంకోర్టు. ఇదే విషయాన్ని కొంతమంది గుర్తు చేశారట.

ఈ నేపథ్యంలో సిట్‌కు తాత్కాలిక బ్రేక్ ఇచ్చిందని అంటున్నారు. సమావేశం తర్వాత డీజీపీ తిరుమల వెళ్లడం, అక్కడ మీడియా సమావేశంలో పై విషయాన్ని చెప్పడం చకచకా జరిగిపోయింది. గురువారం సాయంత్రం న్యాయస్థానం తీర్పు తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.

Related News

AP Fake Liquor case: తంబళ్లపల్లి కల్తీ మద్యం కేసులో కీలక మలుపులు

CM Progress Report: సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్.. పేరిట ఇంటింటికి సీఎం భరోసా..

Kurupam Incident: కురుపాం గురుకులంలో ఇద్దరు విద్యార్థినుల మృతి బాధాకరం: పవన్ కల్యాణ్

AP Rains: ఏపీలో మళ్లీ వర్షాలు.. రేపు ఈ జిల్లాల్లో పిడుగుపాటు హెచ్చరికలు

Srisailam Temple: తిరుమల తరహాలో శ్రీశైల క్షేత్రం అభివృద్ధి.. సీఎం చంద్రబాబు సమీక్ష.. డిప్యూటీ సీఎం కీలక సూచన

CM Chandrababu: అనంతపురం, కురుపాం ఘటనలపై సీఎం చంద్రబాబు ఆరా.. నివేదికలు ఇవ్వాలని ఆదేశాలు

Coconut Price: కొండెక్కిన కొబ్బరి కాయల ధర.. బెంబేలెత్తుతున్న సామాన్యులు

Auto Drivers Sevalo: ఆటో డ్రైవర్ల సేవలో.. జగన్ కోలుకోవడం కష్టం

Big Stories

×