EPAPER

OTT Movie : పొరపాటున ఆ తప్పు చేసే టీనేజర్స్ ఈ దెయ్యాలకు బలి.. హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు చూడకూడని మూవీ 

OTT Movie : పొరపాటున ఆ తప్పు చేసే టీనేజర్స్ ఈ దెయ్యాలకు బలి.. హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు చూడకూడని మూవీ 

OTT Movie :  హారర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ జానర్లో సినిమా అంటే గుర్తొచ్చేది హాలీవుడ్. ఇండియన్ సినిమా చరిత్రలో కూడా ఎన్నో హర్రర్ సినిమాలు రావడం, బ్లాక్ బస్టర్ హిట్ కావడం జరిగింది. అయినప్పటికీ హాలీవుడ్ హారర్ సినిమాలు అంటే పడి చచ్చే వారి సంఖ్య భారీగానే ఉంటుంది. ఎందుకంటే ఈ ఇంగ్లీష్ సినిమాల్లో ఉండే ఎంగేజింగ్ స్టోరీ, భయపెట్టే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాను చూస్తున్నంత సేపు ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ను ఇస్తాయి. అందుకే భాష రాకపోయినా హాలీవుడ్ సినిమాలను చూడడానికి ఇష్టపడతారు కొంతమంది. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. మరి ఈ మూవీ పేరేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.


ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హాలీవుడ్ హారర్ మూవీ ఒక ఎక్స్పరిమెంటల్ సినిమా అని చెప్పొచ్చు. ఈ డిజిటల్ యుగంలో ప్రపంచం మొత్తం అరచేతిలోనే ఉండడంతో దయ్యాలు, భూతాలు వంటి వాటి గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు జనాలు. కానీ ఈ సినిమాలో మాత్రం ఏకంగా ఓ రాక్షసుడుని మేల్కొల్పడానికి ఒక ఆర్గనైజేషన్ పని చేయడం విశేషం. పైగా లేపడానికి టీనేజర్ లనే బలిస్తారు.


కథలోకి వెళ్తే..

ఇందులో ఒక ఆర్గనైజేషన్ దయ్యాలను, రాక్షసులను బంధించి, సాధారణ మానవులపై పరీక్షించడం వంటి ఎక్స్పరిమెంట్స్ చేస్తూ ఉంటారు. అలాగే మరోవైపు ఓ పురాతన రాక్షసుడుని నిద్ర లేపడానికి టీనేజర్లనే ట్రాప్ చేసి, బలి ఇస్తూ ఉంటారు. అయితే అలా ట్రాప్ చేయడానికి ఒక ఇంటిని వాడుకుంటారు. అందులో భాగంగానే ఐదుగురు ఫ్రెండ్స్ సిటీకి దూరంగా ఒక అడవిలో ఉండే క్యాబిన్ హౌస్ కి వెళ్ళాలని డిసైడ్ అవుతారు. కానీ అక్కడ కాలు పెట్టడమే వాళ్ళ జీవితాల్లో సరిదిద్దుకోలేని తప్పు అవుతుందని వాళ్లకి అస్సలు తెలీదు. మొత్తానికి అక్కడికి వెళ్లాక ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు. మరోవైపు సదరు ఆర్గనైజేషన్ కు సంబంధించిన మనుషులు ఈ టీనేజర్లపై ఒక లుక్కేసి ఉంచుతారు. పైగా అదే క్యాబిన్ లో బేస్మెంట్ లో వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ బలివ్వడానికి రెడీగా ఉంటారు. కానీ ఇవన్నీ తెలియని ఆ అమాయకులు ఎంజాయ్ చేస్తూ ఓ వ్యక్తి కంటికి కనబడతారు. అతను అక్కడికెళ్లొద్దు అని ఎంత మొత్తుకున్నా సరే టీనేజర్స్ కదా అస్సలు పట్టించుకోరు. ఇక ఈ సరిదిద్దుకోలేని తప్పు చేసిన ఐదుగురు ఫ్రెండ్స్ ఆ అపరిచితుడు చెప్పే దానిలో  ఎంత వరకు నిజం ఉందో తెలుసుకోవడానికి క్యాబిన్ ని పరిశీలిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సడన్ గా బేస్మెంట్ లో పడిపోతారు. ఆ తర్వాత ఈ ఎక్స్పరిమెంట్ లో ఏం జరిగింది? ఆ దయ్యాల నుంచి తప్పించుకొని బయటపడగలరా లేదా? అనే విషయాలు తెలియాలంటే ‘క్యాబిన్ ఇన్ ది వుడ్స్’ అనే ఈ హారర్ మూవీని చూడాల్సిందే.

Related News

Vettaiyan : ఓటిటిలోకి రజినీకాంత్ ‘వేట్టయాన్’…. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?

OTT Movie : ఇక్కడికి ట్రిప్ కి వెళ్తే తిరిగిరాని లోకాలకు వెళ్ళినట్టే… వెన్నులో వణుకు పుట్టించే సస్పెన్స్ థ్రిల్లర్ 

OTT Movie : అమ్మాయిలను ఆ పని కోసమే టార్గెట్ చేసే దెయ్యం… ఈ బో*ల్డ్ హర్రర్ మూవీ బీభత్సం భయ్యా

OTT Movie : భర్తకు ఆ పాడు అలవాటు… పెళ్లి తర్వాత ప్రియమణి చేసిన బో*ల్డ్ మూవీ ఎక్కడ చూడొచ్చంటే?

OTT Movie : స్వర్గం, నరకాన్ని నమ్ముతారా? ఈ మూవీని డోంట్ మిస్… వణుకు పుట్టించే హర్రర్ మూవీ

Mathuvadalara 2: ఓటీటీ డేట్ ఫిక్స్.. రేటింగ్ గ్యారంటీ..!

Thangalaan OTT : డిజాస్టర్ మూవీ మాకొద్దు… విక్రమ్ మూవీపై బాంబ్ పేల్చిన నెట్‌ఫ్లిక్స్..

Big Stories

×