BigTV English
Advertisement

Teja Sajja : తేజా సజ్జాకు అరుదైన గౌరవం.. ఆ సినిమా వల్లే టాప్..!

Teja Sajja : తేజా సజ్జాకు అరుదైన గౌరవం.. ఆ సినిమా వల్లే టాప్..!

Teja Sajja : టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా పేరు ఇప్పుడు తెలియని వాళ్లు ఉండరు.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన “హనుమాన్” మూవీతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.. అంతేకాదు అందరికీ షాక్ ఇచ్చేలా భారీ కలెక్షన్ను కూడా అందుకుంది.. ఈ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టేసిన తేజ సజ్జా తన నెక్స్ట్ సినిమాకు రెడీ అయిపోయాడు. యంగ్ హీరో ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా అని ఫ్యాన్స్ అనుకున్నారు. ప్రస్తుతం మిరాయ్ అనే భారీ ప్రాజెక్టు లో నటిస్తున్నాడు.. ఇదిలా ఉండగా తేజా సజ్జా కు అరుదైన గౌరవం లభించింది.. ప్రతిష్ఠాత్మక అవార్డు అయన నటనకు దక్కిందని తెలుస్తుంది. ఇంతకీ ఆ అవార్డు ఏంటో ఒకసారి తెలుసుకుందాం..


తేజ సజ్జాకు ఉత్తమ నటుడిగా అవార్డు వరించింది. ‘హనుమాన్‌’ చిత్రంలో నటనకుగానూ హీరో తేజ సజ్జా ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. దాదా సాహెబ్‌ ఫాల్కే ఎంఎస్‌కే ట్రస్ట్‌ 2024 ఈ వార్డును ప్రకటించింది. ఈ మేరకు హనుమాన్ మూవీ మేకర్స్​ సోషల్ మీడియాలో పోస్టు షేర్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవ్వడంతో అతనికి అవార్డు వచ్చింది సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాను తెరకెక్కించారు. 2024 సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ భారీ విజయం సొంతం చేసుకుంది. వరల్డ్​వైడ్​గా రూ.300 కోట్లకు పైగా భారీ కలెక్షన్స్ అందుకుంది. వసూళ్లు సాధించింది. అయితే పార్ట్ 2 కి మాత్రం చాలా టైం పట్టేలా ఉంది.

ఇక హనుమాన్ 2 లో ఏ ఇయర్ రిలీజ్ అనేది ప్రశాంత్ వర్మ ఇంకా అనౌన్స్ చెయ్యలేదు.. దాంతో తేజా మరో సినిమాను లైన్లో పెట్టాడు. తేజా సజ్జా, కార్తీక్ ఘట్టమనేని కాంబోలో మిరాయ్ సినిమా చేస్తున్నాడు. ఇతను రవితేజతో ఈగల్ సినిమాను తీశాడు.. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమాకు ‘మిరాయ్’ అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే.. ఈ సినిమా కథ హనుమాన్ కు భిన్నంగా ఉంటుంది. ఆ సినిమా దేవుడికి రిలేటెడ్ గా వస్తే ఇది క్షుద్ర పూజల నేపథ్యంలో వస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మంచు మనోజ్, దుల్కర్ లాంటి హీరోలు కూడా కనిపించనున్నారు. దుల్కర్ అయితే ఓ యోధుడి పాత్రలో పాత్రలో మెరువనున్నాడు.. మంత్రగాడు పాత్రలో మంచు మనోజ్ నటిస్తున్నాడు .. ఈ మూవీలో రితికా నాయక్‌ హీరోయిన్ గా నటిస్తుంది…


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×