Soaked Almonds: బాదం పప్పులు పోషకాల గని. వీటిలో ఉండే అనేక రకాల పోషకాలు ఆరోగ్యసమస్యలు రాకుండా చేయడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. అంతే కాకుండా వీటిని నానబెట్టి తింటే ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. రాత్రి నానబెట్టి, ఉదయం తొక్క తీసి 5 బాదం పప్పులు తినడం వల్ల పోషకాలను శరీరం సులభంగా గ్రహిస్తుంది. ఈ పద్ధతిని 30 రోజుల పాటు పాటించడం వలన కలిగే అద్భుతమైన 10 ఆరోగ్య ప్రయోజనాలు గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నానబెట్టడం ఎందుకు?
బాదం తొక్కలో టానిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది పోషకాలను శరీరం గ్రహించకుండా కొంతవరకు నిరోధిస్తుంది. నానబెట్టడం వల్ల ఈ టానిన్ సులభంగా తొలగిపోతుంది. తద్వారా బాదంలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు మరింత సమర్థవంతంగా శరీరంలోకి శోషించబడతాయి.
10 ఆరోగ్య ప్రయోజనాలు:
1. మెదడు పనితీరు మెరుగుదల:
బాదంలో ఉండే విటమిన్ E , L-కార్నిటైన్ మెదడు కణాల ఆరోగ్యానికి తోడ్పడతాయి. 30 రోజుల పాటు క్రమం తప్పకుండా నానబెట్టిన బాదం తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అంతే కాకుండా ఏకాగ్రత మెరుగుపడుతుంది. అల్జీమర్స్ వంటి న్యూరోడీజనరేటివ్ వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుంది.
2. మెరుగైన జీర్ణక్రియ:
నానబెట్టిన బాదంలో ఫైబర్ (పీచు) పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. అంతే కాకుండా పేగు కదలికలను క్రమబద్ధీకరిస్తుంది. నానబెట్టడం వలన జీర్ణ ఎంజైమ్‌లు విడుదలయ్యి, జీర్ణక్రియ సులభతరం అవుతుంది.
3. గుండె ఆరోగ్యం:
బాదం పప్పుల్లో ఆరోగ్యకరమైన మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు అంతే కాకుండా మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL)ను పెంచుతాయి. ఇది రక్తపోటును అదుపులో ఉంచి.. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
4. రక్తంలో చక్కెర నియంత్రణ:
బాదంలో ఉండే ఫైబర్, కొవ్వులు, ప్రోటీన్లు గ్లూకోజ్ రక్తంలోకి నెమ్మదిగా విడుదల అయ్యేలా చేస్తాయి. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగకుండా నియంత్రిసతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరం.
5. విటమిన్ E శక్తి:
బాదం విటమిన్ E కి అద్భుతమైన మూలం. ఇది ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది శరీరంలోని కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. 30 రోజుల్లో చర్మం, జుట్టు ఆరోగ్యం మెరుగుపడటానికి ఇది కీలకం.
6. బరువు :
బాదంలో ప్రోటీన్ , ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఉదయం పూట 5 నానబెట్టిన బాదం తినడం వల్ల ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావన కలుగుతుంది. దీని వల్ల అనవసరమైన చిరుతిళ్లు తినాలనే కోరిక తగ్గి, బరువు తగ్గడానికి లేదా నిర్వహించడానికి సహాయ పడుతుంది.
7. ఎముకల పటిష్టత:
బాదంలో కాల్షియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయ పడతాయి. అంతే కాకుండా ఆస్టియోపొరోసిస్ వంటి ఎముకల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
Also Read: రోజూ 2 అరటిపండ్లు తింటే.. ఎన్ని ప్రయోజనాలుంటాయో తెలుసా ?
8. మెరుగైన శక్తి స్థాయిలు:
బాదం ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్‌ల సంపూర్ణ కలయిక. ఇవి శరీరానికి స్థిరమైన శక్తిని అందిస్తాయి. అంతే కాకుండా రోజంతా చురుకుగా ఉండటానికి సహాయ పడతాయి.
9. రోగనిరోధక శక్తి పెంపు:
బాదంలో ఉండే జింక్ , విటమిన్ E వంటి పోషకాలు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు నుంచి రక్షణ లభిస్తుంది.
10. ఒత్తిడి తగ్గింపు:
నానబెట్టిన బాదంలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది “యాంటీ-స్ట్రెస్ మినరల్”గా పనిచేస్తుంది. ఇది నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. అంతే కాకుండా ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. నిద్ర నాణ్యతను కూడా మెరుగు పరుస్తుంది.