Bigg Boss 9 Promo : తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 రియాల్టీ షోకి సంబంధించిన 10వ వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఇప్పుడు 64వ ఎపిసోడ్ కి సంబంధించిన సెకండ్ ప్రోమోని రిలీజ్ చేశారు బిగ్ బాస్ మేకర్స్. మొదటి ప్రోమో లో భరణి, సంజన, దివ్య,నిఖిల్ లు నామినేట్ అయినట్టు చూపించారు. వీరిని టార్గెట్ చేస్తూ కొంతమంది కంటెస్టెంట్లు తమ పాయింట్స్ చెప్పారు. అయితే తాజాగా నామినేషన్స్ కి సంబంధించిన సెకండ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో ఏముంది అంటే..
దివ్య, తనూజ ఇద్దరు గౌరవ్ ఆట తీరుని విమర్శించారు.. మొదట దివ్య గౌరవ్ గురించి మాట్లాడుతూ.. కెప్టెన్సీ టాస్క్ లో నువ్వు ఒకరికి సపోర్ట్ చేస్తున్నావ్. అయితే నువ్వు సపోర్ట్ చేసిన ఆ వ్యక్తి వెళ్ళిపోతే ఇక నా పని అయిపోయిందిలే అని పక్కకు వెళ్లి కూర్చున్నావు. నాకు సంబంధం లేదని అక్కడి నుండి నువ్వు వెళ్లిపోయావ్. ఇలా చేయడం అస్సలు బాలేదు. ఫుడ్ లో నీ భాగం అడగడానికి అయితే ముందు ఉంటావు. కానీ గేమ్ అర్థం చేసుకోవడంలో మాత్రం ముందు ఉండవు..గేమ్ అర్థం చేసుకోలేవు.. అని చెప్పింది.
దానికి గౌరవ్ మాట్లాడుతూ.. గేమ్ స్టార్ట్ అయినప్పుడు నీ టైం వచ్చినప్పుడు నువ్వు సపోర్ట్ చెయ్..నా టైం వచ్చినప్పుడు నేను సపోర్ట్ చేస్తా అన్నావ్. కానీ నీ లక్ష్యం ఒక్కటే.. తనూజని అందులో నుండి తీసివేయడం అంటూ దివ్య గురించి షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు. ఆ తర్వాత తనూజ కూడా దివ్య చెప్పిన పాయింట్ గురించి గౌరవ్ ని నామినేట్ చేస్తూ.. గేమ్ లో నువ్వు ఏం చేస్తున్నావో నీకే అర్థం అవ్వడం లేదు.. ఒకరికి సపోర్ట్ చేయడానికని వచ్చావు. కానీ వాళ్లు గేమ్ నుండి అవుట్ అవ్వడంతోనే ఇక నేను ఎవరికీ సపోర్ట్ చేయను. నాకు వాళ్లతో సంబంధం లేదు అన్నట్టుగానే ప్రవర్తిస్తున్నావ్. నీకు అవసరం ఉన్నప్పుడు అందరితో చాలా బాగుంటావు.కానీ నీకు అవసరం తీరిపోయాక మాత్రం ఏంటి ఏంది అని నీ మాట తీరుతో పాటు బాడీ లాంగ్వేజ్ కూడా పూర్తిగా మారిపోతుంది అంటూ తనూజ తన పాయింట్స్ చెప్పుకొచ్చింది. దానికి గౌరవ్ నా మొదటి ఆప్షన్ భరణి సార్ కానీ నువ్వు మాత్రం వావ్ గౌరవ్ అంటూ నా నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటూ ఫైర్ అయ్యారు.
ALSO READ:Actor Death: ఆర్థిక సహాయం కోసం ఎదురుచూసి నటుడు మృతి.. ఏమైందంటే?
ఆ తర్వాత సుమన్ శెట్టి నిఖిల్ ని నామినేట్ చేయగా.. దాంతో నిఖిల్ కోపంతో సుమన్ అన్నా నువ్వు ఒక్క గేమ్ కూడా ఆడడం లేదు అనడంతో నేను టాస్కులు ఆడాను.ఎన్నో దెబ్బలు కూడా తాకించుకున్నాను. మీరు మాత్రం ఏమీ ఆడకుండా ఉంటున్నారు అని సుమన్ శెట్టి అనడంతో..నేను కూడా టాస్క్ లు ఆడుతున్నా అన్నా నేను చెయ్యి నొప్పితో కూడా గేమ్ ఆడాను అని నిఖిల్ అనడంతో ఫస్ట్ గేమ్ ఆడటం నేర్చుకోండి అని సుమన్ శెట్టి తన పాయింట్స్ చెప్పాడు. దాంతో నిఖిల్ గేమ్ ఆడుతున్నామా లేదా అనేది బయట జనాలు చూస్తారు అంటూ సమాధానం ఇచ్చారు. మీరు కెప్టెన్సీ కంటెండర్ షిప్ నుండి నన్ను తప్పించారు.నా క్యాప్టెన్ కంటెండర్ షిప్ పోయింది అని నిఖిల్ అనడంతో..మీది పోయిందని చెప్పి నన్ను ఇక్కడ ఎలిమినేట్ చేశారా అంటూ సుమన్ శెట్టి అడిగారు. దాంతో నిఖిల్ అవును ఇది కూడా ఒక కారణమే అంటూ సుమన్ శెట్టికి షాక్ ఇచ్చారు. ఇక్కడితో ప్రోమో ఎండ్ అయింది. ఇక ఇందులో ఏం జరిగింది.. ఎవరెవరు నామినేట్ అయ్యారు అనేది తెలియాలంటే కచ్చితంగా ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.