Morning Star Travels Bus: ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఇలా వరుస ప్రమాదాలు జరుగడంపై ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బస్సు ఎక్కాలంటే వణుకుతున్నారు. పల్నాడు జిల్లాలోని రెడ్డి గూడెం దగ్గర ప్రైవేటు ట్రావెల్స్ బస్సు… అదుపు తప్పి పక్కకు ఒరిగింది. రోడ్డు పనులు కోసమని ఏర్పాటు చేసిన పైపులకు తగిలి నిలిచి పోయింది. దీంతో పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. హైదరాబాద్ నుంచి బాపట్ల వెళ్లుతుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం సమయంలో బస్సులో 30మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ఎవరికీ ఎటువంటి హాని జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.