Allu Shirish: అల్లు కుటుంబంలో త్వరలోనే పెళ్లి భాజలు మోగబోతున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్(Allu Aravind) చిన్న కుమారుడు అల్లు శిరీష్(Allu Shirish) ఇటీవల ఎంతో ఘనంగా ప్రేమించిన అమ్మాయి నైనిక రెడ్డి(Nainika Reddy)తో నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి నిశ్చితార్థం కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో అక్టోబర్ 31 వ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను అల్లు శిరీష్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ ఫోటోలలో భాగంగా ఈయన మెడలో చౌకర్ ధరించి కనిపించడంతో ఈ ఫోటోలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.
ఇలా అబ్బాయిలు మెడలో నగలు ధరించడం ఏంటి అనే ధోరణిలో చాలామంది విమర్శలు కురిపించారు. అలాగే ఎంగేజ్మెంట్ కు మెడలు నగలు వేస్తే పెళ్ళికి ఏకంగా వడ్డానం వేస్తారేమో అంటూ చాలామంది విమర్శలు కురిపించారు. అయితే ఈ విమర్శలపై అల్లు శిరీష్ ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా స్పందిస్తూ విమర్శలకు తనదైన స్టైల్ లోనే కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈయన మెడలో నగలు ధరించిన ఫోటోని షేర్ చేస్తూ.. వడ్డానం కేవలం అమ్మాయిలు మాత్రమే వేసుకుంటారు బ్రో.. కానీ మన ఇండియన్ మహారాజులు, మొగులులు చౌకర్ కూడా వేసుకుంటారు అంటూ ఈయన రాజులు మెడలో ధరించిన నగలకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.
ఈ విధంగా అల్లు శిరీష్ స్పందిస్తూ కామెంట్లు చేయడంతో అభిమానులు స్పందిస్తూ పాపం శిరీష్ అన్న హర్ట్ అయినట్టున్నాడు అందుకే ఇలా రియాక్ట్ అవుతూ సమాధానం ఇచ్చారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక అల్లు శిరీష్ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక శిరీష్ తనకు కాబోయే భార్యతో కలిసి దిగిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ వస్తున్నారు. అల్లు శిరీష్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు నైనిక రెడ్డి అనే సంగతి తెలిసిందే.
వచ్చే ఏడాది పెళ్లి..
గత రెండు సంవత్సరాలుగా అల్లు శిరీష్, నైనిక ప్రేమలో ఉన్నారు. ఇలా ప్రేమలో ఉన్న ఈ జంటం త్వరలోనే పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే వీరి వివాహం ఎప్పుడు ఏంటి అనేది వెల్లడించలేదు కానీ అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వీరి వివాహం జరగవచ్చని తెలుస్తుంది. ఇక అల్లు శిరీష్ కెరియర్ విషయానికి వస్తే అల్లు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ ఈయన మాత్రం సరైన సక్సెస్ అందుకోలేకపోయారు. గౌరవం సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన శిరీష్ తన కెరీర్ లో సరైన హిట్ అందుకోలేదు. ఇక ఈయన చివరిగా టెడ్డీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
Also Read: Rashmika: ఆ డైరెక్టర్లు అయితే డార్క్ సీన్స్ అయినా ఓకే అంటున్న రష్మిక..ఎవరా నలుగురు?