Rashmika: రష్మిక మందన్న ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా వరుస సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న రష్మిక(Rashmika) మరోవైపు సినిమా ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. తాజాగా జగపతిబాబు (Jagapathi Babu) హోస్ట్ గా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా రష్మిక తన కెరీర్ కి సంబంధించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. అదేవిధంగా తన లైఫ్ పార్టనర్ గురించి కూడా కొన్ని విషయాలు తెలిపారు.
రష్మిక త్వరలోనే విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో కలిసి ఏడు అడుగులు నడవబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఇక పెళ్లి గురించి కూడా రష్మిక పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. ఇక జగపతిబాబు కార్యక్రమంలో భాగంగా ఈమెకు కొన్ని ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి . మీ లైఫ్ పార్టనర్ లో ఉండాల్సిన లక్షణాలు ఏంటి అంటూ జగపతిబాబు ప్రశ్నించడంతో రష్మిక పెద్ద లిస్టు బయట పెట్టింది. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ.. తనని పెళ్లి చేసుకోబోయే వ్యక్తి తనని చాలా ప్రేమగా చూసుకోవాలి అలాగే తనకు గౌరవం ఇవ్వాలని తెలిపారు. అలాగే ప్రతి విషయంలో ఎంతో నిజాయితీగా ఉండాలి తన పట్ల కేర్ చూపించే వ్యక్తి రావాలని తెలిపారు.
ప్రతి ఒక్క అమ్మాయి తనకు కాబోయే భర్తలో ఈ క్వాలిటీస్ అన్ని ఉండాలని కోరుకుంటారు కానీ ఈక్వాలిటీస్ అన్ని ఒకే వ్యక్తిలో ఉండటం కష్టం అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే వాళ్లు పర్ఫెక్ట్ అంటూ రష్మిక చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక రష్మిక కాబోయే భర్తలో ఇలాంటి క్వాలిటీస్ ఉండాలని చెప్పడంతో ఈ క్వాలిటీస్ అన్ని విజయ్ దేవరకొండలో పుష్కలంగా ఉన్నాయని, ఆయన పర్ఫెక్ట్ అంటూ ఈ సందర్భంగా చెప్పకనే చెప్పేశారు. ప్రస్తుతం రష్మిక చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
డెస్టినేషన్ వెడ్డింగ్..
గత కొన్ని సంవత్సరాలుగా విజయ్ దేవరకొండతో రిలేషన్ లో ఉన్న రష్మిక పెద్దల సమక్షంలో అక్టోబర్ 14వ తేదీ ఎంతో ఘనంగా నిశ్చితార్థం (Engagment) జరుపుకున్నారు. ఇప్పటివరకు ఈ నిశ్చితార్థానికి సంబంధించి రష్మిక విజయ్ దేవరకొండ ఎక్కడ అధికారకంగా వెల్లడించలేదు. ఇక ఈ జంట వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకోబోతున్నారని వీరిద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇక వీరిద్దరూ ఉదయపూర్ ప్యాలెస్ లో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పటికే రష్మిక పెళ్లి పనులలో కూడా ఎంతో బిజీగా ఉన్నారని తన పెళ్లి వేదిక కోసం జైపూర్ లో మూడు రోజులపాటు పర్యటించారని తెలుస్తుంది. త్వరలోనే వీరి పెళ్లికి సంబంధించి అధికారక ప్రకటన కూడా వెల్లడి కానుంది.
Also Read: Allu Shirish: మెడలో నగలు.. ట్రోల్స్ పై రియాక్ట్ అయిన శిరీష్.. హర్ట్ అయినట్టున్నాడే?