Bandi Sanjay: డబ్బులు లేక చదువును మధ్యలో ఆపేసిన విద్యార్థులను మనం చూస్తుంటాం. టాలెంట్ ఉన్నాఆర్థిక సమస్యల వల్ల పైచదువులకు వెళ్లకుండా ఇంటి వద్దే పొలం పనులు చేసే వారు చాలా మందే ఉంటారు. అయితే మట్టిలో మణిక్యాలను ఆదుకునేందుకు నేనున్నా అంటూ భుజం తట్టే రాజకీయ నాయకులను మనం చాలా తక్కువ మంది చూసి ఉంటాం. తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ పేద విద్యార్థులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.
కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తుకు అండగా నిలిచారు కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు చేయూతనిచ్చే ఉద్దేశంతో.,. ఆయన తన సొంత జీతం నుండి పరీక్ష ఫీజులు చెల్లించి గొప్ప మనసును చాటుకున్నారు.
‘మోడీ గిఫ్ట్’ పేరుతో ఈ విద్యా సహాయ కార్యక్రమాన్ని మంత్రి చేపట్టారు. ఈ సందర్భంగా.. 4,847 మంది పదో తరగతి విద్యార్థులకు సంబంధించిన పరీక్ష ఫీజును ఆయన స్వయంగా భరించారు. మొత్తం ఫీజు రూపాయలు 5,45,375 కాగా.. ఆ మొత్తాన్ని ఆయన తన జీతం ఖాతా నుంచే చెల్లించి విద్యార్థులకు భరోసాగా నిలిచారు.
ALSO READ: Squats Benefits: రోజూ 30 గుంజీలు తీయాల్సిందే.. ఎందుకో తెలిస్తే ఆపకుండా చేసేస్తారు!
ఈ సందర్భంగా.. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్ తరపున ఈ మొత్తం పరీక్ష ఫీజు చెక్కును జిల్లా కలెక్టర్ పమేలా సత్పతీకి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మంత్రి బండి సంజయ్ మానవతా దృక్పథాన్ని, విద్యార్థుల పట్ల ఆయనకున్న శ్రద్ధను అభినందించారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఉన్నత విద్యపై ఆసక్తిని పెంచడానికి.. పరీక్షలంటే భయాన్ని పోగొట్టడానికి ఈ సహాయం ఎంతగానో ఉపయోగపడుతోందని.. పలువురు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. పేద విద్యార్థులను ఆదుకునేందుకు ఇలాంటి రాజకీయ నాయకులు బయటకు రావాలని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ALSO READ: KA Paul: వార్తల్లోకి కేఏ పాల్.. సుప్రీంకోర్టు గరంగరం, ఏం జరిగింది?