E-Paper
Advertisement

Mannara Chopra: మన్నారా చోప్రా బర్త్ డే వేడుకల్లో ప్రియాంక చోప్రా – నిక్ జోనస్.. వీడియో వైరల్

Mannara Chopra: మన్నారా చోప్రా బర్త్ డే వేడుకల్లో ప్రియాంక చోప్రా – నిక్ జోనస్.. వీడియో వైరల్
Advertisement
Mannara Chopra
Mannara Chopra

Mannara Chopra: సెలబ్రెటీల బర్త్ డే వస్తుందంటే చాలా సోషల్ మీడియాలో పోస్టులు నిండిపోతాయి. ప్రేక్షకులు, అభిమానులు, స్నేహితులు సైతం శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ల వర్షం కురిపిస్తుంటారు. అయితే తాజాగా అలాంటిదే ఓ నటి బర్త్ డే గ్రాండ్‌గా జరిగింది. కాగా ఆ బర్త్ డే వేడుకకు ఆమె ధరించిన డ్రెస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బాలీవుడ్ నటి బర్త్‌డే గర్ల్ మన్నారా చోప్రా తన హాట్ లుక్‌తో ఇంటర్నెట్‌లో హీట్ పెంచేసింది. బిగ్ బాస్ 17లో పాల్గొని ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ఈ నటి ముంబైలో జరిగిన తన 33వ పుట్టినరోజు వేడుకకు చాలా స్టైల్‌గా వచ్చింది. మన్నారా రెడ్ హాట్ రఫిల్ డ్రెస్‌లో కనిపించి నెటిజన్ల మనస్సులు దోచేసుకుంది. ఆమె వెండి డాంగ్లర్స్, హీల్స్‌తో వావ్ అనే లుక్స్‌తో అందరినీ కట్టిపడేసింది.

Advertisement

ప్రస్తుతం మన్నారా తన పుట్టినరోజు వేడుకలో దిగిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే బర్త్ డే కోసం ఏర్పాటు చేసిన వేదికపైకి వెళ్లే ముందు ఆమె తన బర్త్ డేకి వచ్చిన వారితో వరుస ఫొటోలకు పోజులు ఇచ్చింది. ‘వచ్చినందుకు చాలా ధన్యవాదాలు’ అంటూ మన్నారా వారికి చెప్పింది.

?utm_source=ig_web_copy_link">

Advertisement

Also Read: టిల్లు స్క్వేర్ డైరెక్టర్‌తో సందీప్ కిషన్.. కానీ ట్విస్ట్ ఇదే..!

కాగా మన్నారా అభిమానులకు ఆమె లుక్ ఎంతగానో నచ్చిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో ఆమె లుక్‌పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. అందులో ఒక వినియోగదారు ఇలా రాశాడు.. ‘ఎరుపు అనేది కొత్త వైబ్’ అని అన్నాడు. మరొకరు ‘చాలా అందంగా ఉంది మన్నారా’ అంటూ పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే మన్నారా చోప్రా ఇటీవల తన కజిన్ ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్, వారి కుమార్తె మాల్తీ మేరీతో కలిసి గ్రాండ్‌గా హోలీని జరుపుకుంది. అయితే ఆ హోలీ వేడుకలలో దిగిన ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌‌లో షేర్ చేసింది. అందులో ఒక ఫొటోలో మన్నారా, ప్రియాంక- నిక్‌తో కెమెరాకు పోజులివ్వడం చూడవచ్చు. అలాగే మరొక చిత్రంలో ప్రియాంక తన కూతురిని పట్టుకున్నప్పుడు మన్నారా మాల్తీతో ఆడుకుంటూ కనిపిస్తుంది.

ఈ ఫొటోలను మన్నారా పంచుకుంటూ.. ‘అద్భుతమైన హోలీ గెట్ టుగెదర్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. కుటుంబంతో సమయం గడపడం ఎల్లప్పుడూ చాలా బాగుంటుంది. అంతులేని డ్యాన్స్ సెషన్‌లు, రుచికరమైన ఆహారం, లెక్కలేనన్ని సంతోషకరమైన క్షణాలు’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రాసుకొచ్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×