E-Paper
Advertisement

Sundeep Kishan: టిల్లు స్క్వేర్ డైరెక్టర్‌తో సందీప్ కిషన్.. కానీ ట్విస్ట్ ఇదే..!

Sundeep Kishan: టిల్లు స్క్వేర్ డైరెక్టర్‌తో సందీప్ కిషన్.. కానీ ట్విస్ట్ ఇదే..!
Advertisement
Sundeep Kishan
Sundeep Kishan

Sundeep Kishan: కరోనా మహమ్మారి తర్వాత ఓటీటీలకు మంచి ఆదరణ లభించింది. దీంతో ఓటీటీలో సినిమాలు చూసే ప్రేక్షకులు విపరీతంగా పెరిగారు. అయితే ఆడియన్స్ పెరగడంతో ఆ సంస్థలు కూడా సినిమాలు, వెబ్ సిరీస్‌లను తెరకెక్కించడం మొదలు పెట్టాయి. కొత్ కొత్త స్టోరీలు, డిఫరెంట్ కాన్సెప్టులతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.

అయితే ఒకప్పుడు థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత మాత్రమే ఓటీటీలోకి సినిమాలు రిలీజ్ అయ్యేవి. కానీ ఇప్పుడంతా మారిపోయింది. థియేటర్లతో సమానంగానే ఓటీటీ కూడా సినిమాలు రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. అయితే స్టార్ హీరోలు సైతం ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేయడానికి సిద్ధమవుతున్నారు.

Advertisement

ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోలు ఓటీటీ ద్వారా సినిమాలు చేసి అలరించారు. వెంకటేష్, రానా కలిసి చేసిన రానా నాయుడు తీసి మంచి హిట్ అందుకున్నారు. అలాగే నాగచైతన్య కూడా దూత పేరుతో ఓ సిరీస్‌ తీసి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్నాడు.

Also Read: ప్రముఖ విద్యాసంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా యంగ్ బ్యూటీ శ్రీలీలా..!

Advertisement

అయితే ఇప్పుడీ కోవలోకి మరొక హీరో వచ్చి చేరాడు. ఆ హీరో మరెవరో కాదు.. ఇటీవలే ‘ఊరుపేరు భైరవకోన’తో హిట్ అందుకున్న యంగ్ హీరో సందీప్ కిషన్. అవునండీ మీరు విన్నది నిజమే. తాజాగా టిల్లు స్క్వేర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు మల్లిక్ రామ్‌ – సందీప్ కిషన్ కాంబో ఫిక్స్ అయింది. అయితే అది సినిమా కాదు. సిరీస్‌గా తెరకెక్కబోతుంది.

నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కాబోయే నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ వెబ్‌సిరీస్‌ను మల్లిక్ రామ్ రూపొందించనున్నాడు. రాజీవ్ చిలుక ఈ ప్రాజెక్టుకు నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫిషియల్ అప్డేట్‌తో త్వరలో గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

గతంలో సందీప్ కిషన్ ఒక వెబ్ సిరీస్‌కి నిర్మాతగా చేశాడు. ఇప్పుడు హీరోగా ఒక సిరీస్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. అంతేకాకుండా టిల్లు స్క్వేర్‌తో సూపర్ హిట్ అందుకున్న మల్లిక్ రామ్ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తుండటంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×