BigTV English

Prism Pub Shooting Case: రూ.333 కోట్లు..100 మంది గర్ల్ ఫ్రెండ్స్.. బత్తులోడు మామూలోడు కాదు

Prism Pub Shooting Case: రూ.333 కోట్లు..100 మంది గర్ల్ ఫ్రెండ్స్.. బత్తులోడు మామూలోడు కాదు

Prism Pub Shooting Case: సైబరాబాద్ పోలీసులు ఓ దొంగను అరెస్ట్ చేశారు. ఓ మామూలు దొంగని అరెస్ట్ చేస్తే ఇంత హడావుడి అవసరం లేదు. కానీ.. వాడో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. తనను పట్టుకునేందుకు వచ్చిన పోలీసుల మీదే కాల్పులు జరిపాడంటే.. వాడెంత నొటోరియస్ క్రిమినలో అర్థం చేసుకోవచ్చు. గచ్చిబౌలి ప్రిజమ్ పబ్‌ దగ్గర అరెస్ట్ చేసిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్.. ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. అతనిపై.. 80 కేసులున్నాయి. వాటిలో.. గ్రేటర్ పరిధిలోని 3 కమిషనరేట్లలో 16 కేసులున్నాయి. అన్నింటిలోనూ.. మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు.


కరుడుగట్టిన నేరస్థుడు బత్తుల ప్రభాకర్‌ కేసులో సంచల విషయాలు బయటకొస్తున్నాయి. 333 కోట్ల రూపాయల కూడబెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు నిందితుడు ప్రభాకర్ . 100 మంది గర్ల్ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయడమే మరో టార్గెట్‌గా ప్రభాకర్ పెట్టుకున్నట్లు గుర్తించారు పోలీసులు. రిచ్ లైఫ్ స్టైల్ కోసమే భారీ దొంగతనాలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. 17 ఏళ్ల వయసు నుంచే దొంగతనాలు ప్రారంభించిన ప్రభాకర్.. త్వరలో రెండు భారీ దోపిడీలకు ప్రణాళిక వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ప్రభాకర్‌ నుంచి 3 పిస్టళ్లు, 451 తూటాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మధ్యకాలంలో అతడు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో మాత్రమే చోరీలు చేస్తున్నట్లు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వాంటెడ్‌ నేరస్తుడిగా ఉన్న బత్తుల ప్రభాకర్‌‌ను.. గచ్చిబౌలిలోని ప్రిజం పబ్‌ వద్ద పోలీసుల అతికష్టం మీద అదుపులోకి తీసుకున్నారు.


నేరస్థుడు బత్తుల ప్రభాకర్‌‌కు బిహార్‌లో సైతం లింకులున్నట్లు తెలుస్తోంది. పిస్టోల్ కోసం.. బిహార్‌కు చెందిన అన్షు అనే వ్యక్తి ద్వారా కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వైజాగ్‌ సెంట్రల్‌ జైలులో ఉన్నప్పుడు ఓ ఖైదీ బత్తుల ప్రభాకర్‌ను అవమానించటంతో.. అతడిని చంపేందుకు పిస్టల్స్‌ను కొన్నట్లు పోలీసులు తెలిపారు.త్వరలో రెండు పెద్ద దోపిడీలు చేసే ప్లాన్‌లో ఉన్నాడని చెప్పారు.

బత్తుల ప్రభాకర్‌‌ నేత చరిత్ర కూడా పెద్దదిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలోని పశ్చిమగోదావరి, వైజాగ్‌ ప్రాంతాలలో 2013 నుంచి ప్రభాకర్‌ చోరీలు చేస్తుండేవాడు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో 23 కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నాడు. 21 చోరీల్లో రూ.2.5 కోట్లు కొల్లగొట్టాడు. జైలు నుంచి వచ్చిన తరువాత ఇంజనీరింగ్‌ కాలేజీల్లో మాత్రమే చోరీ చేస్తున్నాడు. గత డిసెంబర్‌లో మొయినాబాద్‌ పీఎస్‌ పరిధిలోని కేజీ ఇంజనీరింగ్‌ కాలేజీలో 8 లక్షలు చోరీ చేశాడని తేలింది. జనవరిలో వీజేఐటీలో 16 లక్షలు దోచుకున్నాడు అని పోలీసులు తెలిపారు.

Also Read: తణుకు ఎస్సై చివరి ఫోన్ కాల్.. చనిపోయేముందు స్నేహితుడితో ఏమన్నాడంటే

కాగా బత్తుల ప్రభాకర్ గచ్చిబౌలి ప్రిజమ్ పబ్‌లో ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు.. అతన్ని పట్టుకునేందుకు అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులపైకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు ప్రభాకర్. కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్‌ ఎడమ కాలికి గాయమైంది. మరో ఇద్దరు పబ్ సిబ్బంది కూడా గాయపడ్డారు. నిందితుడి దగ్గర్నుంచి 2 తుపాకులు, 23 బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు. అతను బీహార్ నుంచి తుపాకులు కొన్నట్లుగా నిర్ధారించారు.

నిందితుడు నుంచి చోరీకి ఉపయోగించే పరికరాలన్నింటిని సీజ్ చేశారు. ప్రస్తుతం ప్రభాకర్‌ని సీసీఎస్, ఎస్వోటీ, క్రైమ్ టీమ్స్ విచారిస్తున్నాయి. ముఖ్యంగా.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్‌పై రెండు తెలుగు రాష్ట్రాల్లో 80 కేసుల వరకు ఉండటం ఇప్పుడు సంచలనంగా మారింది. చాలా తెలివిగా దొంగతనాలు చేయడం, వెంటనే మాయమైపోవడంలో ప్రభాకర్ దిట్ట. మొహానికి మాస్క్ ధరిస్తూ, ఏ చిన్న క్లూ లేకుండా చోరీలు చేస్తుంటాడు. అలా సంపాదించిన డబ్బుతో జల్సాలు చేయడం అలవాటు.

2023 నవంబర్ నుంచి పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నాడు ప్రభాకర్. ఇటీవల మొయినాబాద్‌లో జరిగిన ఓ చోరీ కేసులో ప్రభాకర్ వేలిముద్రల్ని పోలీసులు గుర్తించారు. ఆ డేటాతో సీసీ కెమెరాలని జల్లెడ పట్టారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా మాస్కులు ధరిస్తూ ఎస్కేప్ అయ్యాడు. ఈ క్రమంలో.. ప్రిజమ్ పబ్‌కి తరచుగా వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పబ్ సిబ్బంది సాయంతో ప్రభాకర్‌ని అదుపులోకి తీసుకున్నారు. ప్రభాకర్‌పై ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయన్న అంశాల గురించి లోతుగా విచారిస్తున్నారు పోలీసులు.

Related News

Former DSP Nalini: మాజీ డీఎస్పీ నళిని ఆవేదనపై సీఎం రేవంత్ రియాక్షన్.. కలెక్టర్‌ను ఇంటికి పంపి..?

Sammakka Sagar: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసీ.. ఛత్తీస్‌గఢ్ సీఎంను ఒప్పించిన మంత్రి ఉత్తమ్

HMWSSB: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. బుధవారం ఈ ప్రాంతాల్లో మంజీరా వాటర్ బంద్, కారణం ఇదే

Weather News: మళ్లీ వర్షాలు స్టార్ట్.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వర్షం..

CM Revanth Reddy: హైవే ప్రాజెక్టులపై.. సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

Suryapet News: సూర్యాపేటలో హై టెన్షన్.. పోలీసులను ఉరికించి ఉరికించి.. బీహార్ బ్యాచ్ అరాచకం

Indrakiladri Sharannavaratri: తెలంగాణలో అంగరంగ వైభవంగా.. భద్రకాళి అమ్మవారి ఉత్సవాలు

Bathukamma Kunta: బతుకమ్మ కుంటకు ప్రాణం పోసిన హైడ్రా.. 25న సీఎం చేతులు మీదుగా ప్రారంభం

Big Stories

×