E-Paper
Advertisement

Siva Rama Krishna: నిర్మాతను వదలని పోలీసులు.. మళ్లీ అరెస్ట్

Siva Rama Krishna: నిర్మాతను వదలని పోలీసులు.. మళ్లీ అరెస్ట్
Advertisement

Siva Rama Krishna:  టాలీవుడ్ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ  వివాదాలతోనే బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయడానికి ఆయన చేసిన ప్రయత్నాలు వేరే లెవెల్ అని చెప్పాలి. రాయదుర్గంలో 84 ఎకరాల ప్రభుత్వ భూమిలో పాగా వేయడానికి స్టేట్ ఆర్కియాలజీ విభాగం నుంచి ప్రభుత్వ పత్రాలు కొట్టేసి ఫేక్ డాక్యుమెంట్లను తయారుచేయించి.. ఆ భూమిని కొట్టేయాలని ప్రయత్నాలు చేశాడు. ఇక పత్రాలు నకిలీవి అని అప్పటి ప్రభుత్వం కోర్టులో కేసు వేయడంతో.. గత కొన్నేళ్లుగా ఈ కేసు కోర్టులో నలుగుతుంది.

ఇక రెండు రోజుల క్రితమే  శివరామకృష్ణ ఇచ్చినవి నకిలీ పత్రాలు అని సుప్రీం కోర్టు తేల్చి చెప్పడంతో పోలీసులు శివరామకృష్ణను..  ఆయనకు సహాయం చేసిన ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ సీనియర్ అసిస్టెంట్ కొత్తిని చంద్రశేఖర్, బిల్డర్‌ మారగొని లింగం గౌడ్ లను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. ఇక వెంటనే ఆయన  అనారోగ్య సమస్యల కారణంతో బెయిల్ మీద బయటకు వచ్చాడు.

Advertisement

Samantha: సామ్ చాలా కష్టాలు పడింది.. రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

అయితే  శివరామకృష్ణను మాత్రం పోలీసులు వదిలేలా కనిపించడం లేదు. ఆయన  బెయిల్ ను రద్దు చేయాలనీ పోలీసులు.. కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు వెంటనే బెయిల్ ను రద్దు చేసింది. ఇక బెయిల్ రద్దు అవ్వడంతో పోలీసులు .. శివరామకృష్ణను మరోసారి అరెస్ట్ చేశారు. ఇక నిర్మాత శివరామకృష్ణ  గురించి తెలుగువారికి ప్రత్యేకంగా  చెప్పాల్సిన అవసరం లేదు.

Advertisement

వెంకటేష్, శిల్పాశెట్టి నటించిన సాహస వీరుడు సాగరకన్య  సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఆ తరువాత మహేష్ బాబు తో యువరాజు, వెంకటేష్ తో ప్రేమంటే ఇదేరా లాంటి సినిమాలు నిర్మించాడు. ఇవి మాత్రమే కాకుండా.. సర్దుకుపోదాం రండి, సీతారత్నంగారి అబ్బాయి లాంటి సినిమాలు నిర్మించాడు. ఇక  చివరగా ఆయన రవితేజ నటించిన దరువు సినిమాను తెరకెక్కించాడు. మరి ఈ వివాదం ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×