BigTV English

Samantha: సామ్ చాలా కష్టాలు పడింది.. రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

Samantha: సామ్ చాలా కష్టాలు పడింది.. రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

Samantha: అందాల భామ సమంత  ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. కొన్నేళ్లుగా ఈ చిన్నది సోషల్ మీడియాలో, యాడ్స్ లో తప్ప వెండితెరపై  కనిపించింది లేదు.   అక్కినేని నాగచైతన్య విడాకుల తరువాత సామ్ నటించిన సినిమాలు అన్ని పరాజయాలనే అందుకున్నాయి.  ఈలోపే ఆమె మయోసైటిస్ బారిన  పడింది. ఇక ఈ అరుదైన వ్యాధి వలన సామ్ అనుభవిస్తున్న నరకాన్ని వర్ణించడం చాలా కష్టం. దీని వలన ఆమె ఎక్కువసేపు నిలబడలేదు.. కూర్చోలేదు. చికిత్స లేని ఈ వ్యాధికి ఎక్కడ చికిత్స ఉంటే అక్కడకు వెళ్లి అన్ని ప్రయత్నాలు చేసింది. ఇంకా చేస్తూనే ఉంది.


ఇలాంటి అరుదైన వ్యాధి బారిన పడినా కూడా సామ్ ఏరోజు నిరాశకు గురి కాలేదు. తనవంతు ప్రయత్నం తాను చేస్తూనే ఉంది. అంత బాధలో కూడా ఆమె తన సినిమాలను పూర్తి చేసింది. ఆ సమయంలో ఆమె నటించిన  సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ. ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ మేకర్స్ అయిన రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు.  హాలీవుడ్ స్టార్  డైరెక్టర్స్ రూసో బ్రదర్స్ తెరకెక్కించిన సిటాడెల్ కు రీమేక్ గా ఈ సిరీస్ ను తెరకెక్కించారు.

Pushpa 2 Press Meet: మళ్లీ నార్త్‌నే నమ్ముకుంటున్న మేకర్స్.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై కీలక అనౌన్స్‌మెంట్


ఇక ఇందులో బాలీవుడ్ హీరో  వరుణ్ ధావన్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్ పై అభిమానులు ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. ఇక సిటాడెల్ హనీ బన్నీ నుంచి వచ్చిన పోస్టర్స్,  ట్రైలర్  ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.  ఈ సిరీస్  నవంబర్ 7 నుంచి అమెజాన్ లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. వరుసగా ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు ఇస్తూ అంచనాలను పెంచేస్తున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో దర్శకుల్లో ఒకరైన రాజ్.. సమంత గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.  చైతో విడాకుల తరువాత సామ్, రాజ్ నిడిమోరు తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం విదితమే. నిజం చెప్పాలంటే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ చేయడం వలనే చై, సామ్ కు విడాకులు ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు గుప్పుమన్న విషయం కూడా తెల్సిందే. ఆ తరువాత రాజ్  తో సామ్ చాలాసార్లు కనిపించింది.  ఇక ఇప్పుడు సిటాడెల్ షూటింగ్ సమయంలో సామ్ పడిన కష్టాలను ఆయన ఏకరువు పెట్టడంతో వీరి ప్రేమాయణం రూమర్స్ మరింత హైప్ క్రియేట్ చేశాయి.

Pushpa 2: ‘పుష్ప 2’ నుండి జానీ మాస్టర్ ఔట్

” సెట్ లో సమంత చాలా కష్టాలు పడింది. సిటాడెల్ షూటింగ్ సమయంలోనే ఆమెకు మయోసైటిస్ ఉందని తెల్సింది. ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. సెట్ కు చాలా లేట్ గా వచ్చేది. నీరసంగా ఉండేది. కొన్నిసార్లు స్పృహ తప్పి పడిపోయేది. ఆమె అలా పడిపోయిందో  లేక ఇంకేమైందో తెలియక మేము భయపడేవాళ్లం. ఎన్నోసార్లు అంతా  సెట్ చేసుకొని ఆమె కోసం ఎదురుచూసేవాళ్లం. ఈ సిరీస్ కోసం సామ్ చాలా కష్టపడింది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సిరీస్ తో  సమంత  ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×