Purandeswari: నందమూరి కుటుంబం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఎంతోమంది వారసులు ఇండస్ట్రీకి వచ్చారు. అయితే పెద్ద ఎన్టీఆర్ తరువాత అంతలా పేరును, ఫ్యాన్స్ ను సంపాదించుకున్నది మాత్రం జూనియర్ ఎన్టీఆర్. పెద్ద ఎన్టీఆర్ కొడుకు నందమూరి హరికృష్ణ రెండో భార్య షాలినికి జన్మించిన వారసుడు ఎన్టీఆర్. అయితే షాలినిని, అతని కొడుకు తారక్ ను నందమూరి కుటుంబం స్వీకరించలేదు. కానీ, హరికృష్ణ మాత్రం ఎన్టీఆర్ ను నందమూరి కుటుంబానికి దగ్గర చేయాలనీ చాలా ప్రయత్నాలు చేశాడు.
అంతెందుకు.. ఎన్టీఆర్ అనే పేరును తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ నే పెట్టినట్లు హరికృష్ణ చెప్పుకొచ్చాడు. నా అంశ.. నా అంతటి వాడు అవుతాడు అని తాతగారు దీవించారని ఎన్నో సార్లు హరికృష్ణ చెప్పుకొచ్చాడు. కానీ, ఇప్పటికీ తారక్.. నందమూరి అనే ఇంటి పేరు కోసం, ఆ కుటుంబంతో బంధం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. నందమూరి వారసుడిగా ఏ రోజు కూడా తారక్ ను నందమూరి కుటుంబం చూడలేదు. ఏ ఈవెంట్ కి అయినా..ఫంక్షన్ కి అయినా కూడా తారక్ వెళ్లి వెనుక నిలబడడమే తప్ప ఆ కుటుంబంలో మనిషిగా మెలిగింది లేదు.
ఇక ఎంత కాదనుకున్నా రక్త సంబంధాన్ని వదులుకోలేని అన్న కళ్యాణ్ రామ్ మాత్రం తమ్ముడిని అక్కున చేర్చుకున్నాడు. దీంతో ఎన్టీఆర్ ను చేరదీసినందుకు కళ్యాణ్ రామ్ ను కూడా నందమూరి కుటుంబం పక్కన పెట్టింది. ఇప్పుడు హరికృష్ణ ఇద్దరు కొడుకులు వర్సెస్ నందమూరి కుటుంబం అన్నట్లు జీవిస్తున్నారు. ఇక టీడీపీ పార్టీని ఎప్పటికైనా నిలబెట్టేది ఎన్టీఆర్ అని చాలామంది చెప్పుకొస్తున్నారు. ఒకానొక సమయంలో ఎన్టీఆర్ టీడీపీ కోసం చేసిన ప్రచారం, అందులో తగిలిన దెబ్బలను మర్చిపోవడం అంత ఈజీ కాదు.
ఇక టీడీపీ కి ఎవరైనా వారసుడు ఉన్నాడు అంటే అది ఎన్టీఆర్ నే అని అభిమానులు బల్లగుద్ది చెప్తున్నారు. అయితే అసలు ఎన్టీఆర్ ను నందమూరి కుటుంబం వెలివేయడానికి కారణం ఏంటి అనేది ఎవరికి తెలియదు. కొందరు షాలిని వేరే మతస్తురాలు కావడంతో ఆ కుటుంబం అంగీకరించలేదని చెప్పుకొస్తారు. ఇక తాజాగా నందమూరివారసురాలు, ఎన్టీఆర్ కు అత్త అయిన దగ్గుబాటి పురంధేశ్వరి.. ఎన్టీఆర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్టీఆర్ ను నందమూరి కుటుంబం దూరం పెట్టడానికి చాలా కారణాలు ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చింది.
” జూనియర్ ఎన్టీఆర్ ను చిన్నతనంలో నందమూరి కుటుంబం నుంచి దూరం పెట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటి గురించిపెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. కారణాలు ఉన్నాయి కాబట్టే దూరం పెరిగింది. ఇప్పుడు అలా లేదు. అందరం కలిసే ఉంటున్నాం” అని చెప్పుకొచ్చింది. దీంతో పాటు ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. ” ప్రస్తుతం ఎన్టీఆర్ ది చాలా చిన్న వయస్సు. అలాంటప్పుడు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏముంది. అతడు ఎప్పుడు రావాలనుకుంటాడో అప్పుడు వస్తాడు. పాలిటిక్స్ గురించి తారక్ తన మనసులో ఏమనుకుంటున్నాడు అనేది నాకు తెలియదు. మా మధ్య అలాంటి చర్చలు కూడా ఏమి జరగలేదు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.