SSMB 29 Update: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి(S.S.Rajamouli) ప్రస్తుతం మహేష్ బాబు(Mahesh Babu)తో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా జక్కన్న వెండితెరపై మరొక మ్యాజిక్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడిగా కొనసాగుతున్న రాజమౌళి బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు. ఇటీవల RRR సినిమాతో పాన్ వరల్డ్ స్థాయిలో గుర్తింపు పొందడమే కాకుండా ఈ సినిమాకు ఏకంగా ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు..
నగరాన్ని సృష్టిస్తున్న జక్కన్న…
ఇలా రాజమౌళి సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో ఈయన తదుపరి సినిమాపై ఏకంగా పాన్ వరల్డ్ స్థాయిలోనే అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం మహేష్ బాబుతో ఈయన చేస్తున్న సినిమా SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా విషయంలో రాజమౌళి ప్రతి చిన్న విషయాన్ని ఎంతో కీలకంగా తీసుకొని షూటింగ్ పనులను నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.
50 కోట్లతో భారీ సెట్…
ఈ సినిమా కోసం రాజమౌళి ఏకంగా ఒక మహా నగరాన్ని సృష్టించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలకు సంబంధించి వారణాసి (Varanasi)తరహాలో భారీ సెట్ ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. ఈసెట్ రామోజీ ఫిలిం సిటీ(Ramoji Film City) లో ఏర్పాటు చేయబోతున్నారని, ఈ ప్రత్యేకమైన సెట్ వేయటానికి ఏకంగా 50 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. ఇలా ఒక సెట్ కోసమే రాజమౌళి 50 కోట్లు ఖర్చు చేయిస్తున్నారు అంటే ఈయన ఏ స్థాయిలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారో స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఈ సినిమా ఒక అడ్వెంచరస్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా…
ఇక మహేష్ బాబు ఇప్పటివరకు ఎంతో మంది దర్శకులతో పనిచేశారు కానీ రాజమౌళితో మొదటిసారి ఈ సినిమాలో నటించబోతున్నారు. ఇక ఈ సినిమా మహేష్ బాబు కెరియర్ కు బిగ్ టర్నింగ్ పాయింట్ అవుతుందని చెప్పాలి. ఇక ఇప్పటివరకు మహేష్ నటించిన సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ఒకటి కూడా విడుదల కాలేదు కానీ ఈ సినిమా మాత్రం ఏకంగా పాన్ వరల్డ్ స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హీరోయిన్ గా నటించగా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలకపాత్రలో నటించబోతున్నారు. ఇప్పటికే పృథ్వీ, మహేష్ బాబుకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఒరిస్సాలో షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ఇక ఈ సినిమాలో మరో తమిళ స్టార్ హీరో మాధవన్ కూడా భాగం కాబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇంకా ఈ విషయం గురించి అధికారక ప్రకటన వెలవడలేదు.
Also Read: గౌతమ్ ను చూసి నేర్చుకో పల్లవి ప్రశాంత్.. అడ్డంగా దొరికిపోయిన రైతు బిడ్డ