E-Paper
Advertisement

Pushpa 2 : ఫహాద్ ఫాజిల్ అప్పుడు షూటింగ్ జరగలేదు, ఇప్పుడు అసలు గ్యాప్ లేదు

Pushpa 2 : ఫహాద్ ఫాజిల్ అప్పుడు షూటింగ్ జరగలేదు, ఇప్పుడు అసలు గ్యాప్ లేదు
Advertisement

Pushpa 2 : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టులలో పుష్ప 2 ఒకటి. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇదివరకే వీరి కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఆ స్థాయిలో హిట్ అయిన సినిమా పుష్ప. సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ కి ఎంత క్రేజ్ ఉందో గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రూవ్ అవుతూ వచ్చింది. ఆ క్రేజ్ అనేది పుష్ప సినిమాతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. చాలామంది పొలిటిషన్స్, క్రికెటర్స్ పుష్ప సినిమాలోని మ్యానరిజమ్స్ ను విపరీతంగా వాడటం వలన ఇంకా పాపులర్ అయింది.

ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమాను మొదట ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసారు. కానీ ఈ సినిమాకు సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా పెండింగ్ ఉండటం వలన డిసెంబర్ 6కి పోస్ట్ పోన్ చేసారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుంది. పెద్ద పెద్ద కాస్ట్ ఈ సినిమాలో నటిస్తుంది. ఇక ఈ సినిమాలో మలయాళం సూపర్ స్టార్ ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. పార్ట్ వన్ లో షేకావత్ పాత్రలో కనిపించిన ఫహద్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఇక ఫహద్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది తెలుగు ప్రేక్షకులు ఏరికోరి మరియు ఫహద్ సినిమాలను మలయాళం లో చూసారు.

Advertisement

పుష్ప 2 విషయంలో ఎన్నో రకమైన వార్తలు వినిపిస్తూ వచ్చాయి. ముందుగా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తారు అని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ వార్తలన్నీ నిజం కాలేదు కొన్ని డేట్స్ కారణంగా విజయ్ సేతుపతి ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు అంటూ తర్వాత కూడా కథనాలు వినిపించాయి. ఇక ఫహద్ విషయానికి వస్తే ఈ సినిమాకి సంబంధించి ఎప్పుడో తన సీన్స్ షూటింగ్ జరగాలి. కానీ అప్పుడు డేట్స్ క్లాస్ రావడంతో ఆ సీన్స్ జరగలేదు. ఇప్పుడు వరుసగా గ్యాప్ లేకుండా ఫహాద్ సీన్స్ చేస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఖచ్చితంగా డిసెంబర్ 6న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×