E-Paper
Advertisement

Karthi: సత్యం సుందరం సినిమాకి ఓటిటి పార్ట్నర్ ఫిక్స్

Karthi: సత్యం సుందరం సినిమాకి ఓటిటి పార్ట్నర్ ఫిక్స్
Advertisement

Karthi: కొన్ని సినిమాలు ఎలాంటి విజయాలను సాధిస్తాయో ఎవరూ ఊహించలేరు. భారీ బడ్జెట్ తో చేసిన సినిమాలు కొన్నిసార్లు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టొచ్చు. చిన్న సినిమాలు గా వచ్చిన కొన్ని సినిమాలు సంచలనం సృష్టించొచ్చు. ఇక రీసెంట్ టైమ్స్ లో చిన్న కాన్సెప్ట్ సినిమాలుగా వచ్చి సంచలనం సృష్టించిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇక తెలుగులో అయితే ఆయ్, కమిటీ కుర్రోళ్ళు వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించాయి. పెద్ద సినిమాలకు ధీటుగా రిలీజ్ అయిన ఈ సినిమాలు కంటెంట్ కింగ్ అని మరోసారి నిరూపించాయి. కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే కాకుండా మిగతా ఇండస్ట్రీలో కూడా అద్భుతమైన సినిమాలు ఉంటే వాటిని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు. భాష అర్థం కాకపోయినా సినిమాలను చూడటం అనేది తెలుగు ప్రేక్షకులకు అలవాటుగా మారిపోయింది.

ఇక తమిళ్లో రీసెంట్ గా వచ్చిన సినిమా మోయ్యిజగన్, ఈ సినిమా తెలుగులో సత్యం సుందరం పేరుతో విడుదలైంది. ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కావలసి ఉంది. కానీ అదే రోజున కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద రిలీజ్ కావడంతో ఈ సినిమాను ఒకరోజు పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకుంటుంది. ఒక మామూలు కథను అత్యద్భుతంగా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు సి ప్రేమ్ కుమార్. ఇదివరకే సి ప్రేమ్ కుమార్ 96 అనే ఒక అద్భుతమైన లవ్ స్టోరీని తెరకెక్కించాడు. అటువంటి దర్శకుడు నుంచి సినిమా వస్తుంది అని అంటే చాలామంది మంచి అంచనాలను పెట్టుకొని థియేటర్ కి వచ్చారు. సినిమా కొంతమేరకు స్లోగా ఉన్నా కూడా ఆ అంచనాలన్నిటిని కూడా సక్సెస్ఫుల్ గా అందుకున్నాడు దర్శకుడు సి ప్రేమ్ కుమార్.

Advertisement

ఇక ప్రస్తుతం ఈ సినిమా ఓటిటి పార్ట్నర్ కూడా లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటిటి ప్లాట్ఫారం సంస్థ నెట్ ఫిక్స్ లోకి ఈ సినిమా స్ట్రీమింగ్ కి రానుంది. థియేటర్లో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా ఓటిటిలో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ సినిమాలో కార్తీక్ నటించిన తీరు చాలా మందిని విపరీతంగా ఆకట్టుకుంటుంది అలానే అరవింద్ స్వామి కూడా అద్భుతంగా ఆకట్టుకున్నారు. ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫీ అని చెప్పాలి. స్వతహాగా సి ప్రేమ్ కుమార్ కెమెరామెన్ కావడం వలన విజువల్స్ కూడా స్క్రీన్ పైన అందంగా కనిపించాయి. ఇక గోవింద్ వసంత్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకి గోవింద్ చేసిన మ్యూజిక్ ప్రాణమని చెప్పాలి.

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×