Pushpa2 : టాలీవుడ్ స్టార్ హీరో ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ గతేడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ మూవీ అన్ని ఏరియాలో మంచి టాప్ ను అందుకోవడంతో పాటుగా బాక్సాఫీస్ షేక్ అయ్యేలా కలెక్షన్స్ను రాబట్టింది. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రికార్డులను బ్రేక్ చేసేసింది. ఇప్పటికీ సినిమా థియేటర్లలో రన్ అవుతుంది అంటే మామూలు విషయం కాదు. ఇక ఈ మూవీకి నార్త్ లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో కన్నా హిందీలో రికార్డ్ స్థాయిలో వసూళ్లను రాబట్టింది పుష్ప 2.. మూవీ వచ్చి నెల దాటినా కూడా ఇంకా హిందీలో అదే జోరు కొనసాగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నార్త్ లో ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.. అదేంటో ఒకసారి తెలుసుకుందాం..
పుష్ప 2 మూవీ..
అల్లు అర్జున్ రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప మూవీ గతంలో బ్లాక్ మాస్టర్ హిట్ టాక్ ని అందుకున్న సంగతి తెలిసిందే.. ఆ మూవీకి సీక్వెల్ గా పుష్ప 2 మూవీ రిలీజ్ అయింది. థియేటర్లలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఈ సినిమా పాజిటివ్ టాక్ తో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. 1800 కోట్లకు పైగా కలెక్షన్లను అందుకుందని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ మూవీ స్టోరీ తో పాటు మ్యూజిక్ కు మంచి మార్కులు పడ్డాయి. దేవిశ్రీప్రసాద్ తెలుగులో అదిరిపోయే మ్యూజిక్ ని అందించారు.. ఇక ఈ మూవీ త్వరలోనే ఓటిటిలో వచ్చేందుకు రెడీ అవుతుంది.
నార్త్ లో పుష్ప 2..
ఈ మూవీకి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సాలిడ్ ట్యూన్స్ ఆల్రెడీ సోషల్ మీడియాలో రూల్ చేస్తున్నాయి. అయితే ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మాత్రమే కాకుండా కోలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు సామ్ సి ఎస్ కూడా వర్క్ చేశాడు. ఇకపోతే పుష్ప 2 లో ఎవరెవరు ఏ స్కోర్ అందించారు అనేది ఇపుడు తెలిసే అవకాశాలు ఉన్నాయని ఫిలింనగర్ లో టాక్ . ఇటీవల దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్స్ వస్తే సామ్ సి ఎస్ కూడా ఇపుడు తన వెర్షన్ పుష్ప 2 ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ని వదలబోతున్నట్టుగా కన్ఫర్మ్ చేసాడు.. ఇక దీంతో పుష్ప 2 లో ఎవరెవరు ఏ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు అనేది ఒక కొలిక్కి రానుంది అని చెప్పవచ్చు. ఇక ఈ ఓఎస్టి ఎప్పుడు వస్తుంది అనేది త్వరలో క్లారిటీ రానుంది..
ఇక పుష్ప 2 మూవీలో హీరోయిన్గా రష్మిక మందన నటించగా, సునీల్, అనసూయ, రావు రమేష్, పహాద్ పాజిల్ తదితరులు కీలక పాత్రలో నటించారు..
#pushpa2 OST ….!
LOADING……..99%
Releasing very soon..🤗🙌🏻🤗@alluarjun @SukumarWritings @NavinNooli @MythriOfficial @tseriessouth @TSeries pic.twitter.com/Y7V6lm63PC
— 𝐒𝐀𝐌 𝐂 𝐒 (@SamCSmusic) January 23, 2025