BigTV English

Anil Ravipudi: అనిల్ రావిపూడి రియల్ లవ్ స్టోరీ.. భార్య ఫ్రెండ్ ను ప్రేమించి.. చివరకు

Anil Ravipudi: అనిల్ రావిపూడి రియల్ లవ్ స్టోరీ.. భార్య ఫ్రెండ్ ను ప్రేమించి.. చివరకు

Anil Ravipudi: సక్సెస్.. అవ్వడానికి మూడు పదాలు అయినా అది అందుకోవాలంటే  దాని వెనుక ఎంతో కఠిన  శ్రమ, పట్టుదల, కృషి ఉండాలి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి వస్తున్నవారికీ అయితే.. ఇవన్నీ కూసింత ఎక్కువే ఉండాలి.  ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు సక్సెస్ అవుతారు అనేది చెప్పడం చాలా కష్టం.  ఒక 10 సినిమాలు తీస్తే అందులో రెండు, మూడు హిట్ అవ్వడమే గగనం అనుకున్నఈ రోజుల్లో  ఒక డైరెక్టర్ ఇప్పటివరకు పరాజయాన్ని అందుకోలేదు అంటే నమ్ముతారా.. ? ఆ డైరెక్టర్ గురించి చెప్తే నమ్ముతారు. అతనే డైరెక్టర్ అనిల్ రావిపూడి. 10 ఏళ్లు.. 8 సినిమాలు. 8 హిట్ సినిమాలే. ఇలాంటి ట్రాక్ రికార్డ్ అందుకున్న డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి ఒకడు.


టాలెంట్. ఎవరబ్బా సొత్తు కాదు. ఒకరి టాలెంట్ ను వాడుకొని పైకి ఎదిగినంత మాత్రాన వారు అసలైన డైరెక్టర్స్ అయిపోరు. తన టాలెంట్ ను గుర్తించలేకపోవడంతోనే రచయితగానే ఉండాల్సిన అనిల్ రావిపూడి డైరెక్టర్ గా మారాడు. రచయితగా కెరీర్ ను మొదలుపెట్టాడు అనిల్. 2005 లో విడుదలైన గౌతమ్ SSC సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా అనిల్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.

శౌర్యం, కందిరీగ, శంఖం, దరువు, సుడిగాడు, మసాలా, ఆగడు, పండగ చేస్కో లాంటి సినిమాలకు కథలను, డైలాగ్స్ ను అందించాడు. ఇక ఆ సినిమాలకు తనకంటూ ఒక ప్రత్యేకేమైనా గుర్తింపు కనుక వచ్చిఉంటే అనిల్ డైరెక్టర్ గా మారకపోయేవాడేమో. కానీ, రచయితగా అతనికి మంచి గుర్తింపు దక్కలేదు. కథ, డైలాగ్స్ అందించినా తమను గుర్తించలేదు అనే బాధతో తానే డైరెక్టర్ గా  మారాడు.


అలా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా  పటాస్. నందమూరి కళ్యాణ్ రామ్ కు కెరీర్ బెస్ట్ మూవీ అంటే పటాస్ అని చెప్పొచ్చు. అప్పటివరకు ప్లాప్స్  లో కొట్టుమిట్టాడుతున్న నందమూరి హీరోకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను అందించి.. మొదటి సినిమాతోనే స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఆ తరువాత ఇండస్ట్రీలో వరుస ప్లాప్స్ లో ఉన్నవారికి హిట్లు ఇవ్వడమే పనిగా పెట్టుకున్నాడు అనిల్ రావిపూడి.

Prabhas: కన్నప్పలో ప్రభాస్ ఎంట్రీ సాంగ్.. ఒక్క హిట్ కోసం ఎన్ని కష్టాలు పడుతున్నావ్ విష్ణు మావా

సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 3, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం. ఇలా పదేళ్లలో 8 సినిమాలు.. 8 బ్లాక్ బస్టర్స్.  నేటికి అనిల్ రావిపూడి ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు  అవుతుంది. ఇప్పటివరకు పరాజయం ఎరుగని దర్శకుల  లిస్ట్ లో రాజమౌళి తరువాత అనిల్ పేరునే వినిపిస్తుంది.

సినిమాల విషయం పక్కన పెడితే.. నిజ జీవితంలో కూడా అనిల్ హీరోనే. మంచి కుటుంబం.. అందమైన భార్య. ఆయన లవ్ స్టోరీ కూడా సినిమా కథకు తీసిపోదు. ఇంకా చెప్పాలంటే సూర్య సన్నాఫ్ కృష్ణ స్మాల్ వెర్షన్ అని చెప్పుకోవచ్చు. ఒక ఇంటర్వ్యూ లో అనిల్ తన లవ్ స్టోరీని చెప్పుకొచ్చాడు. ” నా భార్య పేరు భార్గవి. మాది లవ్ మ్యారేజ్. మా ప్రేమ కథ గురించి చెప్పాలంటే.. కాలేజ్ చదివే రోజుల్లో మా బ్యాచ్ మొత్తం నలుగురు అమ్మాయిల బ్యాచ్ వెనుక పడేవాళ్లం. ఆ నలుగురులో నేనొక అమ్మాయిని ప్రేమించాను. ఆమెకు పెళ్లి అవ్వడంతో నేను డీలా పడిపోయాను. అయితే ఆమె పక్కన ఉన్న మరో ఫ్రెండ్ నే భార్గవి. ఆమెనే పెళ్లి చేసుకున్నాను. సో.. భార్య ఫ్రెండ్ కు సైట్ కొడితే భార్య పడింది” అని చెప్పుకొచ్చాడు.

అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. మొదట ఆ నలుగురు అమ్మాయిల్లో ఒక అమ్మాయితో అనిల్ ప్రేమలో ఉన్నాడట. కొన్ని నెలల తరువాత ఆ అమ్మాయి.. అనిల్ ను మోసం చేసి వెళ్లిపోయిందట. అప్పుడే భార్గవి.. అనిల్ దగ్గరకు వచ్చి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను.. పెళ్లి చేసుకుంటాను అని అడిగిందట. దీంతో ఇరువర్గాల కుటుంబాలను ఒప్పించి అనిల్.. భార్గవిని పెళ్లి చేసుకున్నాడట. ఇప్పటికీ రోజు.. తన భార్య అనిల్ ప్రేమించిన అమ్మాయిని గుర్తుచేసి గొడవ పడుతుందని చెప్పుకొచ్చాడు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు.  ఇలా అనిల్ లవ్ స్టోరీ పెళ్లితో ముగిసింది. మరి ఈ పరాజయమే ఎరుగని దర్శకుడు ముందు ముందు ఎలాంటి సినిమాలు తీసి మెప్పిస్తాడో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×