E-Paper
Advertisement

Pushpa 2 Teaser Date: బ్రేకింగ్.. పుష్ప 2 టీజర్ అప్డేట్ వచ్చేసింది.. ఏప్రిల్..

Pushpa 2 Teaser Date: బ్రేకింగ్.. పుష్ప 2 టీజర్ అప్డేట్ వచ్చేసింది.. ఏప్రిల్..
Advertisement

Pushpa 2 Teaser Releasing on April 8th: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. ఎట్టకేలకు పుష్ప 2 అప్డేట్ ను మేకర్స్ అందించారు. అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2. దాదాపు మూడేళ్ళ క్రితం పుష్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. తగ్గేదేలే అని ప్రపంచం మొత్తం అనిపించాడు బన్నీ. ఈ సినిమా ఏ రేంజ్ రికార్డులు బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక దానికి సీక్వెల్ గా పుష్ప 2 రానుంది. సుకుమార్ ఈ సినిమాను శిల్పాన్ని చెక్కిన్నట్లు చెక్కుతున్నాడు. పుష్పను మించి పుష్ప 2 ఉండబోతుందని మొదటి నుంచి మేకర్స్ చెప్పుకుంటూనే వస్తున్నారు. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఎప్పుడు ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా పోస్టర్స్ సైతం రికార్డ్ లను సృష్టించాయి.

Advertisement

ఇక ఎప్పటినుంచో ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసారు. ఆ ఎదురుచూపులకు నేటితో తెరపడింది. ఇక టీజర్ అప్డేట్ పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. టీజర్ రిలీజ్ డేట్ ను అధికారికంగా వెల్లడించారు. ఏప్రిల్ 8 న టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతేకాకుండా కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ గజ్జకట్టిన కాలును చూపిస్తూ.. టీజర్ డేట్ ను ప్రకటించారు. ఏప్రిల్ 8.. అల్లు అర్జున్ పుట్టినరోజు. దీంతో బన్నీ పుట్టినరోజు సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈరోజు నుంచే పుష్ప మాస్ జాతర మొదలయిందని మేకర్స్ చెప్పకనే చెప్పుకొచ్చారు. ఇక ఈ అప్డేట్ నుంచి.. ఆగస్టు 15 రిలీజ్ వరకు ఏదో ఒక పోస్టర్ ను రిలీజ్ చేస్తూ హైప్ పెంచనున్నారట మేకర్స్.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×