Big Stories

Men Chasing Womens Car: మహిళ కారును వెంబడించిన రౌడీలు.. ఏం చేసిందో చూస్తే షాక్ అవ్వాల్సిందే

- Advertisement -

Men Chasing Womens Car: భారతదేశానికి స్వతంత్రం వచ్చినా.. దేశంలో నివసించే మహిళలకు మాత్రం స్వేచ్ఛ, స్వతంత్రం రావడం లేదు. మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు వంటి ఘటనలు దేశంలో తరచూ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా బెంగుళూరులో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. అర్థరాత్రి కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళను కొంత మంది ఆకతాయిలు వెంబడించి తీవ్ర భయబ్రాంతులకు గురి చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

- Advertisement -

రెండు బైకులపై ముగ్గురు ఆకతాయిలు ఓ కారులో ప్రయాణిస్తున్న మహిళను వెంబడించారు. కారు డోర్స్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తూ మహిళను భయబ్రాంతులకు గురిచేశారు. ఈ ఘటన బెంగుళూరులోని కోరమంగలాలో వెలుగుచూసింది. దీనికి సంబంధించిన ఘటనను సదరు మహిళ వీడియో తీసిన ఎక్స్ లో షేర్ చేసింది. ఈ ఘటన ఆదివారం అర్థరాత్రి జరిగినట్లు తెలిపింది. యువకులు తనను వెంబడిస్తున్న సమయంలో మహిళ చాకచక్యంగా వ్యవహారించింది. వెంటనే తన ఫోన్ నుండి హెల్ప్ లైన్‌లకు కాల్ చేసింది. తను ప్రయాణిస్తున్న కారును ముగ్గురు వెంబడిస్తున్నారని కంప్లైంట్ చేసింది.

Also Read: హే ప్రభూ.. బార్బీలా మారాలనుకుని.. చివరికి జాంబీలా తయారైందేంటి

హెల్ప్‌లైన్‌కు కాల్ చేసిన మహిళ తీవ్ర భయాందోళనతో తన కారును ఆకతాయిలు వెంబడిస్తున్నట్లు తెలిపింది. ‘నా పేరు ప్రియమ్ సింగ్, నన్ను ముగ్గురు ఆకతాయిలు అదే పనిగా వెంబడిస్తున్నారు. నా కారు డోరు తీయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. నా కారును ఢీ కొడుతూ.. బైకుపై ముగ్గురు వ్యక్తులు ఫాలో అవుతున్నారు. నా కారు ముందుకు వెళ్లి రోడ్డును బ్లాక్ చేసి నన్ను వెళ్లనివ్వకుండా చేస్తున్నారు. నేను వారి నుండి తప్పించుకుంటూ వేరే దారిలో వెళ్తున్నాను. ప్రస్తుతం నేను ఎస్టీ. జాన్స్ హాస్పిటల్ గేట్ నెంబర్ 5 వల్ల ఉన్నారు. రౌడీలు వెంబడిస్తున్న బైక్ నెంబర్ KA04LK2583. నా కారు రిజిస్ట్రేషన్ నెంబర్ KA51MT5653’ అని హెల్ప్ లైన్ వారికి సదరు మహిళ వివరాలను తెలిపింది.

అయితే తనను రౌడీలు వెంబడించిన వీడియోను కూడా ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియోపై డీసీపీ సీకే. బాబా స్పందించారు. ఆ ముగ్గురు ఆతాయిలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. ‘ఇటువంటి ఘటనను మా వద్దకు తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు. రోడ్డు భద్రతలను తీసుకునేందుకు మేము కట్టుబడి ఉన్నాం. వెంటనే నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాం’ అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళ దైర్యాన్ని చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘నీలా ప్రతీ మహిళ దైర్యంగా సమస్యను ఎదుర్కుని.. పోలీసుల సహాయం తీసుకుంటే మహిళలపై అఘాయిత్యాలను కొంత వరకైనా అరికట్టవచ్చు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News