E-Paper
Advertisement

Pushpa2 : పుష్ప గాడు అంటే తగ్గేదేలే.. ఐటమ్ సాంగ్ కే 8 కోట్లు..?

Pushpa2 : పుష్ప గాడు అంటే తగ్గేదేలే.. ఐటమ్ సాంగ్ కే 8 కోట్లు..?
Advertisement

Pushpa2 : ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్, లెజెండరి డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రాబోతున్న మూవీ పుష్ప 2… ఈ మూవీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఈ మూవీ ఇప్పుడు పాన్ ఇండియా వైడ్‌గా మోస్ట్ వాంటెడ్‌గా నిలుస్తోంది. సుకుమార్ తన శైలిలో ఈ మూవీని చెక్కుతూనే ఉన్నాడు. ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ అయితే పూర్తిగా లాక్ అయిపోయింది. ఇంకో పాట మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. పుష్ప లో సమంతతో స్టెప్పులు వేయించాడు. పుష్ప 2 లో ఐటమ్ సాంగ్ ఎవరు చేస్తారని మొన్నటివరకు సస్పెన్స్ ఉన్నది. ఇప్పుడు శ్రీలీలను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.. అయితే శ్రీలీలను ఫిక్స్ చెయ్యడానికి కారణం రెమ్యూనరేషన్ అని తెలుస్తుంది.. ఈ స్పెషల్ సాంగ్ కు శ్రీలల ఎంత తీసుకుంటుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అయితే పుష్ప 2 స్పెషల్ సాంగ్ కోసం ముందుగా ప్రభాస్ బ్యూటీ శ్రద్దా కపూర్ ను దించాలని అనుకున్నారట. కానీ ఆమె డిమాండ్ ఎక్కువ చేసిందని టాక్ అంతేకాదు. డేట్స్ కూడా సరిగ్గా ఇవ్వలేదట. దాంతో యంగ్ బ్యూటీ శ్రీలీలాను ఓకే చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ సాంగ్ కోసం శ్రీలీలకు 8 కోట్లు ఇవ్వనున్నారని ఓ వార్త ఇండస్ట్రీలో షికారు చేస్తుంది. ఈ సారి బడ్జెట్ విషయంలో సుక్కు నో కాంప్రమైజ్ అంటున్నాడు. కాబట్టి శ్రీలీలను ఓకే చేశారట.. ఇక బన్నీతో శ్రీలీల స్టెప్పులు అంటే.. స్క్రీన్ చిరిగిపోవాల్సిందే. డ్యాన్సుల్లో ఈ ఇద్దరూ ఇద్దరే అన్న సంగతి తెలిసిందే.. శ్రీలీల స్టెప్పులకు అందరూ ఫ్యాన్స్ అయిపోయారు. శ్రీలీల స్ప్రింగులా వేసే స్టెప్పులకు హీరోలు తేలిపోయారు.

Advertisement

రవితేజ తో చేసిన ధమాకా సినిమా శ్రీలీల గ్రేస్, స్టైలీష్ స్టెప్పులతోనే ఆడియెన్స్‌కి ఎక్కువ రీచ్ అయిందన్న సంగతి తెలిసిందే. ఈ సాంగ్ తో శ్రీలీలా టాలెంట్ మరోసారి బయటపడే అవకాశాలు ఉన్నాయి.. మాములుగా బన్నీ డ్యాన్సును హీరోయిన్లు మ్యాచ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. కానీ శ్రీలీలకు ఆ టాలెంట్ ఉంది. బన్నీకి గట్టి పోటీ ఇచ్చేలా శ్రీలీల స్టెప్పులు వేస్తుంది..ఇద్దరినీ ఒకే స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ డిసెంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా రాబోతుంది. ఒకరోజు ముందు ఓవర్సీస్ లో షోలు పడబోతున్నాయి.. ఈ సినిమా కల్కి రికార్డ్ లను బ్రేక్ చేస్తుందా లేదా అన్నది చూడాలి..

ఇక ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో కలిపి 11,500 స్క్రీన్‌లపై ప్రదర్శితం కానున్నదని నిర్మాణవర్గాలు ఇప్పటికే తెలిపారు. ఇప్పటివరకు ఏ భారతీయ సినిమా ఈ స్థాయిలో విడుదల కాలేదని పేర్కొన్నది. ఇండియాలో 6,500, ఓవర్సిస్‌లో 5000 స్క్రీన్‌ లపై ‘పుష్ప 2’ రిలీజ్‌ అవుతున్నదని, ఇదొక రికార్డని ట్రేడ్ వర్గాలు తెలిపారు. ఇప్పటికే ఓటీటీ మార్కెట్‌లో రికార్డు స్థాయి వ్యాపారం చేసుకున్న ఈ మూవీ థియేటర్లలో ఎలాంటి టాక్ ను అందుకుంటుందో.. ఇక ఈ మూవీలో ఫహాద్‌ ఫాజిల్‌, సునీల్‌, అనసూయ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.

Advertisement

 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×