Pushpa2 Collections : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ చిత్రం పుష్ప 2.. ఈ మూవీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.. డిసెంబర్ 5 న రిలీజ్ అయిన ఈ మూవీ ప్రస్తుతం రెండు వారాలు పూర్తి చేసుకుంది. కానీ కలెక్షన్స్ మాత్రం ఎక్కడ తగ్గలేదు. టాలీవుడ్, బాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. వారం లోపే 1000 కోట్లను క్రాస్ చేసి రికార్డు బ్రేక్ చేసింది. ఇప్పుడు మరో రికార్డు ను బ్రేక్ చేస్తూ 1600 కోట్లను అందుకుంది. ముఖ్యంగా హిందీ బెల్టులో ఊహించని ఊచకోత సాగించిన ఈ బ్లాక్ బస్టర్ అక్కడ ఇప్పుడప్పుడే నెమ్మదించేలా లేదు.. వచ్చే వారం రిలీజ్ కానున్న బేబీ జాన్ కన్నా బన్నీ మూవీకే ఎక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ ఉండటం గమనించాల్సిన విషయం. బాలీవుడ్ నుంచి 600 కోట్ల మార్కుని దాటేసి ఏకంగా షారుఖ్ ఖాన్ ని సవాల్ చేసిన అల్లు అర్జున్ ఫైనల్ రన్ ఎక్కడ ఆపుతాడో అర్థం కాలేదు.. కలెక్షన్స్ అంతలా వస్తున్నాయి..
పుష్ప రాజ్ కు జోడిగా రష్మిక మందన్న నటించింది.. ఆమె నటనతో మరోసారి ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. ఫాహాద్ ఫాజిల్, అనసూయ, రావు రమేష్, సునీల్ తదితరులు ఈ మూవీలో నటించారు. ఇక ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్‌కు విపరీతమైన గిరాకీ నెలకొంది. భారతీయ చిత్ర పరిశ్రమ చరిత్రలోనే తొలిసారిగా రూ. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది. ఏకంగా 11 వేల థియేటర్లతో బరిలోకి దిగిన పుష్ప 2 తొలి వారంలోనే ఏకంగా రూ.1000 కోట్లను, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్ల వసూళ్లు రాబట్టింది.. బాహుబలి 2, దంగల్ మూవీ రికార్డులను బ్రేక్ చేసే దిశగా మూవీ కలెక్షన్స్ ను వసూల్ చేస్తుంది..
పుష్ప 2 1600 కోట్లు వసూల్ చేసి సునామి సృష్టిస్తుంది. ఈ మూవీ మొత్తం రన్ పూర్తయ్యేసరికి పుష్ప 2 రెండు వేల కోట్లను సాధిస్తాడా? లేదా? అన్నది ఆసక్తిగా మారింది.. ఈ జోరు చూస్తుంటే అదేం కష్టం కాదు కానీ మరీ ఈజీ అని కూడా చెప్పలేం. ఎందుకంటే ఇంకో 500 కోట్లు రావాలంటే అనూహ్యమైన పికప్ ఉండాలి. ఇప్పటికే అధిక శాతం ఆడియన్స్ థియేటర్లలో చూసేశారు. టికెట్ రేట్లు సాధారణం అయ్యాయి కాబట్టి ఫ్యాన్స్ రిపీట్ షోలు వేసుకోవచ్చేమో కానీ ఇంకా చూడని జనాలు ఎంత శాతం ఉన్నారనే దాన్ని బట్టి టార్గెట్ ఆధారపడి ఉంటుంది.. ఒకవేళ కొత్త సినిమాల్లో ఏదైనా యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే చెప్పలేం కానీ లేదంటే పుష్ప 2 లక్ష్యాన్ని అందుకోవడం అసాధ్యం కాదు. సంధ్య థియేటర్ ఘటన వల్ల పలు చోట్ల సక్సెస్ మీట్ నిర్వహించలేదు. ఏది ఏమైనా టాలీవుడ్ గర్వపడే స్థాయిలో పుష్ప 2 సాధించిన ఘనవిజయం మాములుది కాదు. అల్లు అర్జున్ అన్నట్టు దీన్ని ఎవరు బ్రేక్ చేస్తారో చూడాలి.. ఇదే స్పీడు క్రిస్మస్ వరకు కొనసాగిస్తే దంగల్ రికార్డ్ లను బ్రేక్ చెయ్యడం పక్కా అని ట్రేడ్ పంతులు చెబుతున్నారు.