BigTV English
Advertisement

Pushpa 2: ‘పుష్ప 2’కి ఎదురుదెబ్బ.. ఇకపై అక్కడ షోలు ఉండవు

Pushpa 2: ‘పుష్ప 2’కి ఎదురుదెబ్బ.. ఇకపై అక్కడ షోలు ఉండవు

Pushpa 2: ఈరోజుల్లో ఓటీటీ ఎఫెక్ట్ వల్ల థియేటర్లలో విడుదలయిన ఏ సినిమా గురించి అయినా కొన్నిరోజులకే మాట్లాడుకోవడం మానేస్తున్నారు ప్రేక్షకులు. అలా సినిమాల థియేట్రికల్ రన్ చాలావరకు తగ్గిపోయింది. కానీ కొన్ని సినిమాలు మాత్రమే చాలారోజుల వరకు థియేటర్లలో సందడి చేస్తూ కలెక్షన్స్‌ను కొల్లగొడుతున్నాయి. అలాంటి సినిమాల్లో ‘పుష్ప 2’ ఒకటి. పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 5న విడుదలయిన ఈ మూవీని థియేటర్లలో చూడడానికి ఇంకా ప్రేక్షకులు వస్తూనే ఉన్నారు. కానీ ఇదే సమయంలో ‘పుష్ప 2’కు ఎదురుదెబ్బ తగిలింది. ఇకపై ఒక ప్రముఖ మల్టీ ప్లెక్స్ చైన్ నుండి ‘పుష్ప 2’ను తొలగిస్తున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.


సినిమాల పోటీ

‘పుష్ప 2’ సినిమాకు టికెట్ రేట్లు పెంచి కలెక్షన్స్ విషయంలో భారీగానే టార్గెట్ పెట్టుకున్నారు మేకర్స్. ఆ టార్గెట్‌ను రీచ్ అయ్యారు కూడా. దేశవ్యాప్తంగా త్వరగా రూ.1000 కోట్ల వసూలు సాధించిన సినిమాగా ‘పుష్ప 2’ రికార్డ్ బద్దలుకొట్టింది. ఇప్పటికీ ఈ మూవీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుండడంతో ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా విడుదలయ్యి రెండు వారాలు అయినా దీని తర్వాత మరే ఇతర చిత్రం విడుదల కాకపోవడంతో ‘పుష్ప 2’ కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరిగింది. కానీ ఈ శుక్రవారం మాత్రం నాలుగు సినిమాలు థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి. దీంతో పాటు ‘పుష్ఫ 2’కు మరో ఎదురుదెబ్బ తగిలింది.


Also Read: నార్త్ బాక్సాఫీస్‌పై పుష్పరాజ్ దండయాత్ర.. ఒరిజినల్ సినిమాలకు మించి కలెక్షన్స్

పీవీఆర్ నిర్ణయం

‘పుష్ప 2’కు ఇదే రేంజ్‌లో కలెక్షన్స్ కొనసాగాలంటే సింగిల్ స్క్రీన్స్‌తో పాటు మల్టీ ప్లెక్స్‌లో కూడా ఈ మూవీ మరికొంత కాలం నడవాల్సిందే. కానీ ఒకవైపు ఒకేసారి నాలుగు సినిమాల పోటీతో పాటు ‘పుష్ప 2’ మూడో వారంలోకి ఎంటర్ అవ్వడంతో ఈ మూవీని తీసేయాలని పీవీఆర్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా పీవీఆర్ నుండి ఈ సినిమా తొలగించడానికి యాజమాన్యం సిద్ధపడిందట. ఇదే జరిగితే ‘పుష్ప 2’ కలెక్షన్స్‌కు భారీగా గండి పడనుంది. ఈ సినిమాను సింగిల్ స్క్రీన్‌లో మాత్రమే కాకుండా మల్లీ ప్లెక్స్‌లో చూడడానికి వచ్చే ప్రేక్షకులు కూడా భారీ సంఖ్యలోనే ఉంటారు. ఇలాంటి సమయంలో పీవీఆర్ (PVR).. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ‘పుష్ఫ 2’కు పెద్ద ఎదురుదెబ్బ.

భారీగా ప్రమోషన్స్

సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ‘పుష్ఫ 2’ (Pushpa 2) సినిమా మూడేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూడేళ్ల క్రితం ‘పుష్ప’ పార్ట్ 1 విడుదలయినప్పుడు ఒకే ఏడాది గ్యాప్‌లో సీక్వెల్‌ను కూడా విడుదల చేస్తామని మాటిచ్చారు. కానీ అది మూడేళ్ల వరకు జరగలేదు. అందుకే దాదాపు ఈ సినిమాపై ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ పోయింది. అదే సమయంలో ‘పుష్ప 2’పై ఆసక్తికర అప్డేట్స్ అందిస్తూ అందరిలో మళ్లీ హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు మేకర్స్. అల్లు అర్జున్, రష్మిక మందనా స్వయంగా వెళ్లి ప్రతీ రాష్ట్రంలో ప్రేక్షకులకు ఈ మూవీ రీచ్ అయ్యేలా చేశారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×