BigTV English

Pushpa2 Day 4 Collections : 1000 కోట్లకు చేరువలో పుష్ప రాజ్.. ఇది కదా ఫ్యాన్స్ కోరుకునేది..

Pushpa2 Day 4 Collections : 1000 కోట్లకు చేరువలో పుష్ప రాజ్.. ఇది కదా ఫ్యాన్స్ కోరుకునేది..

Pushpa2 Collections : దేశ వ్యాప్తంగా పుష్ప 2 మేనియా కొనసాగుతుంది. తమ అభిమాన హీరో నటించిన పుష్ప 2 ను చూడాలన్న అభిమానుల కోరిక తీరింది.. డిసెంబర్ 5న దేశ వ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ అయ్యింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్‌లు వంటి ప్రముఖులు నటించిన మూవీ పుష్ప2 ది రూల్ మూవీ మూడేళ్ల తర్వాత పుష్పరాజ్ ఎలాంటి మ్యాజిక్ చేశాడు?.. సినిమాలో హైలెట్ అంశాలు ఏంటి? ఇక కలెక్షన్స్ ఎంత రాబట్టిందో తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. మరి సినిమా అన్ని ఏరియాల్లో రికార్డులు బద్దలు కొట్టే కలెక్షన్స్ ను వసూల్ చేస్తుంది. నాలుగు రోజులకు ఎంత రాబట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం..


గతంలో వచ్చిన పుష్ప సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీ కేవలం నాలుగు రోజుల్లోనే బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తుంది. అస్సలు ఊహించని విధంగా కలెక్షన్స్ రావడంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. పాన్ ఇండియా మూవీ హిందీ, తెలుగులో పుష్ప 2 రికార్డు వసూళ్లు అందుకోగా తమిళ్, కన్నడలో కూడా బాగానే ఉన్నాయి. కానీ మలయాళంలో మాత్రం పుష్ప 2 వసూళ్లు దారుణంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బన్నీకి మలయాళ ప్రేక్షకులు మల్లు అర్జున్ అని పిలుస్తారన్న సంగతి తెలిసిందే. పైగా పుష్ప 2లో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ కూడా ఉన్నప్పటికీ అక్కడ కలెక్షన్స్ కాస్త తక్కువగా ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.

పుష్ప 2 కలెక్షన్స్ విషయానికొస్తే.. మొదటి రోజు భారీగా ఓపెనింగ్స్ జరిగాయని తెలిసిందే.. 180 కోట్లకు పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసి బాక్సాఫీస్ దుమ్ములేపిండు పుష్పరాజ్.. మొదటి రోజున 300 కోట్ల టార్గెట్ తో ఈ మూవీ రిలీజ్ అయ్యింది. కానీ 200 కోట్ల లోపే వసూల్ చేసింది. రెండో రోజు ఓపెనింగ్స్ సరిగ్గా లేకున్నా కూడా తగ్గేదేలే అన్నట్లు ఏకంగా 250 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయని తెలుస్తుంది. ఇక మూడో రోజు మళ్లీ వసూళ్లు పుంజుకున్నాయి. 449 కోట్ల గ్రాస్ ను ప్రపంచం వ్యాప్తంగా రాబట్టి రికార్డు బ్రేక్ చేసింది. ఇక నాల్గొవ రోజు ఏకంగా 621 కోట్లు రాబట్టిందని తెలుస్తుంది.. ఇక వారంలోపే సినిమా 1000 కోట్లను క్రాస్ చేస్తుందని తెలుస్తుంది. ఇదే జోరులో కలెక్షన్స్ రాబడితే మాత్రం కల్కి రికార్డులను బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. చూడాలి మరి ఇంకా ఎన్ని కోట్లు వసూల్ చేస్తుందో.. ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా.. ఫాహద్ ఫాజిల్, అనసూయ, సునీల్, రావు రమేష్, జగపతిబాబులు కీలక పాత్రల్లో నటించారు. మొదటి నుంచి మూవీ నుంచి విడుదలైన అప్డేట్స్ అన్ని కూడా భారీ హైప్ ను తీసుకురావడంతో కలెక్షన్స్ పెరుగుతున్నాయని టాక్.. ఇక ఈ మూవీ తర్వాత కాస్త గ్యాప్ తో పుష్ప 2 సీక్వెల్ గా పుష్ప 3 రాబోతుందని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే..


Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×