BigTV English

Hair Care: జుట్టుకు హెన్నా అప్లై చేసేటప్పుడు.. ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Hair Care: జుట్టుకు హెన్నా అప్లై చేసేటప్పుడు.. ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Hair Care: శతాబ్దాలుగా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి, జుట్టును బలోపేతం చేయడానికిచాలా మంది హెన్నాను కూడా అప్లై చేస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్‌లో అనేక రకాల హెన్నాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అది వారి జుట్టును బలపరుస్తుంది. కానీ కొన్నిసార్లు హెన్నా జుట్టుకు అప్లై చేసేటప్పుడు చేసే కొన్ని రకాల టిప్స్ జుట్టుకు హాని కలిగిస్తాయి.


ఈ రోజుల్లో.. రసాయనాలతో తయారు చేసిన హెన్నాతో పాటు బ్లాక్ మెహందీ కూడా విరివిగా అందుబాటులో ఉన్నాయి. హెర్బల్ హెన్నాకు బదులుగా వాటిని ఉపయోగించడం కొన్నిసార్లు హానికరం.

హెన్నా అప్లై చేసేటప్పుడు చేసే తప్పులు:


మార్కెట్‌లో లభించే అనేక హెన్నాల్లో జుట్టు, చర్మానికి హాని కలిగించే హానికరమైన రసాయనాలు ఉంటాయి. చాలా మంది బ్లాక్ హెన్నా వాడుతుంటారు. ఇది PPD అనే రసాయనం తో తయారవుతుంది. ఇది అలెర్జీలకు కారణమవుతుంది. వీటిని కొనుగోలు చేసేటప్పుడు, ఎల్లప్పుడూ పేరున్న బ్రాండ్ నుండి లేబుల్ తో చేయబడిన హెన్నాను ఎంచుకోవాలి.

హెన్నాలో తగినంత నీటిని వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా చేస్తే.. మందపాటి లేదా సన్నని పేస్ట్‌గా తయారవుతుంది. ఇది జుట్టుకు అప్లై చేయడం చాలా కష్టం. హెన్నాలో నీటిని మాత్రమే వేసి మిక్స్ చేయండి. ఇందులో నిమ్మరసం లేదా పెరుగు వాడటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వాడే ముందు హెన్నా కనీసం 2-3 గంటలు నానబెట్టండి. రాత్రిపూట నానబెట్టడం కూడా మంచిది.

మురికి జుట్టు మీద హెన్నా ఎప్పుడూ అప్లై చేయకూడదు. హెన్నాను అప్లై చేసే ముందు జుట్టుకు నూనె రాయకండి. హెన్నాను జుట్టు అంతటా, ముఖ్యంగా మూలాలపై సమానంగా పెట్టేలా చూసుకోండి.

చాలా మంది హెన్నాను త్వరగా జుట్టుకు అప్లై చేసి వాష్ చేస్తుంటారు. హెన్నాను కనీసం 6-8 గంటలు లేదా రాత్రిపూట నానబెట్టండి. హెన్నాను వేడి నీళ్లలో అస్సలు నానుబెట్టకూడదు. వేడి నీరు రంగును తేలికపరుస్తుంది. చల్లని లేదా గోరువెచ్చని నీటిని ఉపయోగించండి. హెన్నాను వాడిన తర్వాత జుట్టుకు షాంపూ లేదా సబ్బు అస్సలు వాడకూడదు.

హెన్నాను జుట్టుకు అప్లై చేయడానికి సరైన మార్గం:
ముందుగా జుట్టును కడిగి ఆరబెట్టండి. నూనె అప్లై చేయకూడదు. మీ జుట్టు పొడవుగా, మందంగా ఉంటే దానిని భాగాలుగా చేయండి. మెహందీని జుట్టుకు అప్లై చేసుకునేటప్పుడు చేతులకు గ్లౌజ్ లను పెట్టుకోండి. హెన్నా పేస్ట్‌ను బ్రష్ లేదా అప్లికేటర్‌తో జుట్టు మీద రాసుకోండి. మూలాల నుంచి అప్లై చేయండి. జుట్టు అంతా అప్లై చేసి కనీసం 6-8 గంటలు లేదా రాత్రిపూట పొడిగా ఉండనివ్వండి.

Related News

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Fennel Seeds: సోంపు తినడం వల్ల ఎన్ని లాభాలుంటాయో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు !

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Big Stories

×