Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ సీజన్ 8లో ఫినాలేకు చాలా దగ్గర వరకు వచ్చి ఎలిమినేట్ అయిపోయింది విష్ణుప్రియా. మొదట్లో విష్ణుప్రియా పర్సనాలిటీని చాలామంది ఇష్టపడ్డారు. తన సరదా నేచర్ చాలామందికి నచ్చింది. అందుకే తనకు ఓట్లు కూడా చాలానే పడ్డాయి. మెల్లగా తను ఆట నుండి డైవర్ట్ అయ్యింది. పృథ్వి ఆటలో దూరిపోయింది. తనకంటూ సొంతంగా గేమ్ ప్లాన్ లేకుండా చేసేసుకుంది. ఇదే కారణంతో తనపై నామినేషన్స్ కూడా పడ్డాయి. అయినా వేరే కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు కానీ విష్ణుప్రియా మాత్రం ఫైనల్స్‌కు దగ్గర వరకు వచ్చి ఎలిమినేట్ అయ్యింది. వెళ్లిపోతూ బిగ్ బాస్ స్టేజ్‌పై, ఆ తర్వాత బజ్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది విష్ణు.
గర్వంగా ఉంది
ముందుగా బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోయి స్టేజ్‌పైకి రాగానే తన తండ్రికి కూతుళ్లు పుట్టారని బాధపడ్డాడని తన తల్లి చెప్పేదని గుర్తుచేసుకుంది విష్ణుప్రియా. అలాంటి తండ్రిని బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చేలా చేసి ఆయనను ప్రపంచానికి పరిచయం చేసినందుకు చాలా గర్వంగా ఉందని చెప్పింది. తన తల్లి ఎక్కడ ఉన్నా కచ్చితంగా తాను కూడా గర్వపడుతూ ఉంటుందని సంతోషం వ్యక్తం చేసింది. ఆ తర్వాత కంటెస్టెంట్స్‌కు సెండ్ ఆఫ్ ఇచ్చే ముందు ఎవరు ట్రాఫీకి చాలా దగ్గర్లో ఉన్నారని తాను అనుకుంటుందో బయటపెట్టింది. అసలు గౌతమ్ గేమ్ తనకు అర్థం కాలేదని తనకు ట్రోఫీని దూరం పెట్టింది. ఆ తర్వాత ప్లేస్‌లో అవినాష్‌ను పెట్టింది. ప్రేరణ లేడీ విన్నర్ అయితే బాగుంటుంది అంటూనే తనకు రెండో స్థానాన్ని ఇచ్చింది.
Also Read: రోహిణి ఎలిమినేట్..8 వారాలకు ఎంత రెమ్యునరేషన్ అందుకుందంటే..?
ఊహలు తారుమారు
తను ఒకప్పుడు తాను విన్నర్‌గా, నిఖిల్ రన్నర్‌గా ఊహించుకున్నానని బయటపెట్టింది విష్ణుప్రియా. కానీ తన ఊహలు తారుమారు అయ్యాయి కాబట్టి నిఖిల్ విన్నర్ అవ్వాలని కోరుకుంది. కంటెస్టెంట్స్‌కు, నాగార్జునకు గుడ్ బై చెప్పిన తర్వాత బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొంది విష్ణుప్రియా. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. బజ్‌లోకి వెళ్లగానే తాను అసలు కోటి రూపాయలు ఇచ్చినా బిగ్ బాస్‌కు వెళ్లను అని ఒకప్పుడు విష్ణుప్రియా అన్న మాటలను గుర్తుచేశాడు అర్జున్. ఆ తర్వాత ఒక్క ఆట కూడా ఆడకుండా 14 వారాలు హౌస్‌లో బాగానే ఉన్నావంటూ తన ఆట గురించి వ్యంగ్యంగా మాట్లాడాడు. ఆపై పృథ్వితో తన రిలేషన్‌షిప్ గురించి అడిగాడు.
క్రష్ చేసేయాలనుకున్నా
‘‘నాకు పృథ్వి అనే వ్యక్తి ఫ్రెండ్ కంటే ఎక్కువగా నచ్చాడు. కొంచెం క్రష్, ఆకర్షణలాగా అనుకోవచ్చు. క్రష్ చేసేద్దాం ఈ అబ్బాయిని అనిపించేంతలా నచ్చాడు. పృథ్విని కన్నందుకు థాంక్యూ అని వాళ్ల అమ్మకు నేను చెప్పాను. పెళ్లయిన తర్వాత ఏ అమ్మాయి అయినా తనను కూతురిలాగానే చూసుకోవాలని కోరుకుంటారు’’ అని నోరుజారింది విష్ణుప్రియా. దీంతో పెళ్లి వరకు ఆలోచించేశావా అంటూ అర్జున్ షాకయ్యాడు. తను ఆట సరిగ్గా ఆడలేదని పదేపదే అంటూ విష్ణుప్రియాను రెచ్చగొట్టాడు అర్జున్. దీంతో తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంది విష్ణుప్రియా. తనను క్లాస్‌లో లాస్ట్‌లో వచ్చిన స్టూడెంట్‌తో పోల్చుకుంది.