E-Paper
Advertisement

Radhika Apte : తల్లి కాబోతోంది… సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన బాలయ్య హీరోయిన్

Radhika Apte : తల్లి కాబోతోంది… సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన బాలయ్య హీరోయిన్
Advertisement

Radhika Apte : బోల్డ్ హీరోయిన్ రాధిక ఆప్టే తాజాగా అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చింది. ఏకంగా ఒక ఫిలిం ఫెస్టివల్ లో బేబీ బంప్ తో దర్శనమిచ్చి అందరినీ నోళ్ళు వెళ్లబెట్టేలా చేసింది.

బేబీ బంప్ తో దర్శనం ఇచ్చిన రాధికా 

Advertisement

‘రక్త చరిత్ర’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రాధిక ఆప్టే సౌత్ తో పాటు నార్త్ లో కూడా హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈ తమిళ బ్యూటీ ‘ధోని’ సినిమాతో నార్త్ ఆడియన్స్ ని కూడా అలరించింది. అయితే లెజెండ్, లయన్ వంటి సినిమాలో నందమూరి బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. ఇలా తెలుగుతోపాటు తమిళ, మరాఠీ, బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.

కాగా ఈ బ్యూటీ పాపులర్ బ్రిటిష్ మ్యూజిషియన్ బెనెడిక్ట్ టేలర్ ను పెళ్లి చేసుకుంది. ‘త్వరలో తల్లి కాబోతున్నాను’ అనే విషయాన్ని తాజాగా బేబీ బంప్ ఫోటో ద్వారా వెల్లడించింది. ఆమె బిఎఫ్ఐ లండన్ ఫిలిం ఫెస్టివల్ 2024లో బేబీ బంప్ తో దర్శనమిచ్చి అభిమానులకు షాక్ ఇచ్చింది. అయితే తమ అభిమాన నటి త్వరలోనే తల్లి కాబోతుందనే సర్ప్రైజ్ విషయం తెలిసిన ఆమె ఫాలోవర్లు రాధికా ఆప్టేకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే పలువురు సినీ సెలబ్రిటీలు ఆమెను ఈ శుభ సందర్భంగా విష్ చేస్తున్నారు.

Advertisement

బెనిడిక్ట్ తో లవ్ స్టోరీ ఇలా…

వైరల్ వీడియోలతో పాటు పలు వివాదాల్లో కూడా చిక్కుకున్న రాధిక ఆప్టే ఏ విషయంలోనైనా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా మొహం మీద చెప్పేస్తుంది. ఈ బ్యూటీ 2011లో బెనెడిక్ట్ టేలర్ ను మొదటిసారి లండన్ లో కలిశారు. కొంతకాలం లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న తర్వాత పెళ్లి చేసుకున్నారు. 2012లోనే రాధిక ఆప్టే అతడిని పెళ్లాడింది. కానీ ఈ పెళ్లి ప్రైవేట్ గా జరగడంతో 2013లో అధికారికంగా వేడుక జరుపుకున్నారు. ఇటీవల కాలంలో రాధిక ఆప్టే ‘మెర్రీ  క్రిస్మస్’ అనే సినిమాలో అతిథి పాత్రను పోషించింది. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కత్రినా కైఫ్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషించారు.

ప్రస్తుతం ఆమె ఖాతాలో ‘సిస్టర్ మిడ్ నైట్’ అనే సినిమా ఉంది. ఈ ఏడాది మేలో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రీమియర్ అయిన ఈ సినిమాకు కరణ్ కంధారి దర్శకత్వం వహించారు. ఇక ఇదే సినిమా స్క్రీనింగ్ కోసం తాజాగా రాధిక బిఎఫ్ఐ లండన్ ఫిలిం ఫెస్టివల్ లో బేబీ బంప్ తో దర్శనమిచ్చింది. ఈ సినిమాతో పాటు కీర్తి సురేష్ తో కలిసి ఓ సినిమా చేస్తోంది. అయితే రాధిక ఆప్టే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేసిందా? లేదంటే తల్లయ్యాక ఈ సిరీస్ షూటింగ్లో భాగం కాబోతుందా? అనే విషయం తెలియాల్సి ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×