BigTV English

Jyothirmai : ఇండస్ట్రీలో చెప్పే వారే కానీ సహాయపడేవారు లేరు – సాయికుమార్ డాటర్..!

Jyothirmai : ఇండస్ట్రీలో చెప్పే వారే కానీ సహాయపడేవారు లేరు – సాయికుమార్ డాటర్..!

Jyothirmai : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సొంతం చేసుకున్న సాయికుమార్ (Sai Kumar) బిజెపి సభ్యుడు కూడా.. సాయి కుమార్ కుటుంబానికి కూడా సినీ ఇండస్ట్రీతో మంచి అనుబంధం ఉంది.. ముఖ్యంగా సాయికుమార్ తండ్రి పీ.జె.శర్మ, ఇద్దరు తమ్ముళ్లు అయ్యప్ప శర్మ, రవిశంకర్ ఇద్దరు నటులు డబ్బింగ్ ఆర్టిస్ట్లే. మరొకవైపు సాయికుమార్ కొడుకు ఆది (Aadhi Sai Kumar)కూడా హీరోగా గుర్తింపు సొంతం చేసుకున్నారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన సాయికుమార్.. తొలిసారి ఎన్టీఆర్, ఏఎన్నార్ నటించిన సంసారం అనే సినిమాకి డబ్బింగ్ అందించారు. ఆ తర్వాత బాల నటుడుగా కూడా అవకాశాలు అందుకున్నారు. ఇక్కడ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఈయన నటించిన తొలి చిత్రం దేవుడు చేసిన పెళ్లి. అందులో అంధుడి పాత్రలో నటించారు. ఆ తర్వాత కన్నడ చిత్రాలలో హీరోగా నటించిన ఈయన తెలుగు చిత్రాలతో మంచి పేరు సొంతం చేసుకున్నారు.


రవిశంకర్ బాబాయ్ వల్లే నాన్నకు ఆర్థిక కష్టాలు..

సినీ ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉంటూ తమ పని తాము చేసుకుంటూ పోయే కుటుంబాలలో ఈయన కుటుంబం కూడా ఒకటి అని చెప్పాలి. అటు పీజే శర్మ కూడా ఏ రోజు వివాదాలలో నిలవలేదు. ఇదిలా ఉండగా ఇండస్ట్రీలో కష్టం వచ్చినప్పుడు ఎవరు ముందుకు రారని, కేవలం ముందుకు వస్తామని చెబుతారు అంటూ ఊహించని సంచలన కామెంట్లు చేసింది సాయికుమార్ కూతురు జ్యోతిర్మయి (Jyothirmai).తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. బాబాయ్ రవిశంకర్ (Ravi Shankar) చేసిన సినిమా వల్ల నాన్న ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా వారే కష్టపడుతూ అప్పులు తీర్చేశారు అంటూ తెలిపింది జ్యోతిర్మయి.


ఇండస్ట్రీలో ఏ ఒక్కరూ సహాయపడలేదు..

ఇక ఆ సమయంలో అటు మెగాస్టార్ ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ , నందమూరి ఫ్యామిలీ ల నుంచి మీకు ఎటువంటి సహాయం లభించలేదా అని అడగగా.. ఇండస్ట్రీలో సహాయం చేస్తామని చెబుతారే కానీ ఎవరు మాకు సహాయపడలేదు. ఆ సమయంలో ఎవరు కూడా అందుబాటులోకి రాలేదు. పైగా మమ్మల్ని పట్టించుకున్న నాథుడు కూడా లేడు అంటూ సంచలన కామెంట్లు చేసింది. వాస్తవానికి సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీలుగా గుర్తింపు తెచ్చుకున్న నందమూరి, అక్కినేని, మెగా ఫ్యామిలీలను ఉద్దేశిస్తూ ఇన్ డైరెక్ట్ గా కామెంట్లు చేసింది జ్యోతిర్మయి. ఏది ఏమైనా తాము కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు ముందుకు రాలేదని, తామే కష్టపడి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడ్డాము అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సాయికుమార్ కూతురు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

అవకాశం ఇస్తే నటిస్తా..

ఇకపోతే ఇండస్ట్రీలోకి రావడం ఇష్టమేనా అని యాంకర్ అడగగా.. అవకాశం ఇస్తే నటిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. కెమెరా అంటే భయం లేదా అని అడగ్గా.. ఒకసారి వస్తేనే కదా తెలిసేది అంటూ కూడా చెప్పుకొచ్చింది . ఏది ఏమైనా ఈమె కూడా ఇండస్ట్రీలోకి రావాలని ఆశపడుతున్నట్లు తెలుస్తోంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×