E-Paper
Advertisement

Vidya Vasula Aham Teaser: ఆహాలో మరో సినిమా వచ్చేస్తుంది.. టీజర్ భలే ఉందే

Vidya Vasula Aham Teaser: ఆహాలో మరో సినిమా వచ్చేస్తుంది.. టీజర్ భలే ఉందే
Advertisement

Vidya Vasula Aham Teaser: ఈ మధ్యకాలంలో ఓటిటీ ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో అందరికి తెల్సిందే. థియేటర్ లో సినిమా వచ్చింది అంటే అది హిట్ అవుతుందో లేదో తెలియదు. అందుకే చిన్న సినిమాలను ముందే ఓటిటీలో వదిలేసి మేకర్స్ తమ డబ్బును కాపాడుకుంటున్నారు. తాజాగా మరో చిన్న సినిమా డైరెక్ట్ ఓటిటీలోకి రావడానికి సిద్దమయ్యింది. అదే విద్య వాసుల అహం.

రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా మణికాంత్ గెల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎటర్నిటీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై లక్ష్మీ నవ్య మోటూరు & రంజిత్ కుమార్ కొడాలి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. త్వరలోనే థియేటర్ లో రిలీజ్ అవుతుంది అనుకున్న సినిమా సడెన్ గా ఓటిటీ బాట పట్టింది. ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ అధికారికంగా తెలుపుతూ టీజర్ ను కూడా రిలీజ్ చేశారు.

Advertisement

టీజర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. విద్య, వాసు అనే జంట కథ. ఏ భార్యాభర్తల మధ్య అయినా అహం కచ్చితంగా ఉంటుంది. వివాహంలో అహం ఉంటే ఆ జంట పరిస్థితి ఏంటి అనేది సినిమాలో వినోదాత్మకంగా చూపించారు. వాసుకు పెళ్లి ఇష్టం ఉండదు. కానీ, అందరూ పెళ్లి చేసుకోమని వేధించడంతో తప్పక విద్యను పెళ్లి చేసుకుంటాడు. అయితే విద్యకు కొంచెం అహం ఎక్కువ. పెళ్ళికి ముందే ఆ విషయం వాసుకు చెప్తుంది.

పెళ్లి తరువాత చిన్న గొడవలు వచ్చినా ఇద్దరు అహం చూపించుకుంటూ కాపురాన్ని చాలా కాంప్లికేటెడ్ చేసుకుంటారు. మరి చివరికి ఈ ఇద్దరిలో అహం ఎవరు తగ్గించుకున్నారు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. స్ట్రీమింగ్ డేట్ ను ఇంకా మేకర్స్ అధికారికంగా చెప్పలేదు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×