Big Stories

TSBIE: ఇంటర్ కాలేజీల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల..

TSBIE: పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థులకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్టు తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. పదో తరగతిలో వచ్చిన జీపీఏ ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు.

- Advertisement -

మే 9వ తేదీ నుంచి తొలి దశ ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ప్రారంభం కానున్నట్లు బోర్డు బుధవారం అధికారికంగా ప్రకటించింది. మే 9వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు దరఖాస్తులను ఇంటర్ కాలేజీల్లో స్వీకరించనున్నారు. జూన్ 1వ తేదీ నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభం కానున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది. కాగా, జూన్ 30వ తేదీ లోపు తొలి దశ అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

- Advertisement -

అయితే పదో తరగతి పూర్తి చేసి ఇంటర్మీడియట్ లో ప్రవేశాలు పొందాలనుకునే వారు.. ఆన్ లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న మార్స్క్ మెమో, ఆధార్ కార్డును తప్పని సరిగా జతపరచాలి. తాము ఎంచుకున్న కాలేజీల్లో ప్రొవిజినల్ అడ్మిషన్ పూర్తి అయిన తర్వాత కచ్చితంగా విద్యార్థులు ఒరిజినల్ మెమోతో పాటుగా టీసీని కాలేజీలో సమర్పించాలి.

Also Read: సెట్ నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే..

పదో తరగతిలో వచ్చిన జీపీఏ ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రవేశాల కోసం ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకూడదని ఇంటర్ బోర్డు ఆయా కాలేజీలకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. విద్యార్థులు పూర్తి సమాచారం కోసం https://acadtsbie.cgg.gov.in/ వెబ్ సైట్ చూడవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News