BigTV English

BCCI Released Schedule: టీమిండియా శ్రీలంక పర్యటన.. షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ

BCCI Released Schedule: టీమిండియా శ్రీలంక పర్యటన.. షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ

BCCI Released Schedule: టీ20 వరల్డ్ కప్ టోర్నీలో విజేతగా నిలిచిన టీమిండియా ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉంది. ఆతిథ్య జట్టుతో ఐదు టీ20ల సిరీస్ లో తలపడుతుంది. జులై 14తో ఈ సిరీస్ ముగియనున్నది. ఆ తరువాత ఈ నెలాఖరులో టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనున్నది. శ్రీలంకతో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనున్నది. ఈ టూర్ కు సంబంధించిన మ్యాచ్ ల వివరాలను బీసీసీఐ తాజాగా ప్రకటించింది. టీ20 మ్యాచ్ లన్నీ పల్లెకెలెలో, వన్డే మ్యాచ్ లు కొలంబోలో జరగనున్నాయని ఆ ప్రకటనలో తెలిపింది. బీసీసీఐ త్వరలోనే జట్లను కూడా ప్రకటించనున్నది. భారత కోచ్ గా గౌతమ్ గంభీర్ ప్రయాణం ఈ సిరీస్ తోనే మొదలుకానున్నది.


టీ20 సిరీస్ షెడ్యూల్ వివరాలు..

జులై 26న తొలి టీ20 మ్యాచ్
జులై 27న రెండో టీ20 మ్యాచ్
జులై 29న మూడో టీ20 మ్యాచ్


వన్డే సిరీస్ షెడ్యూల్ వివరాలు..

ఆగస్టు 1న తొలి వన్డే
ఆగస్టు 4న రెండో వన్డే
ఆగస్టు 7న మూడో వన్డే

Tags

Related News

UAE Vs IND : UAE పై టీమిండియా భారీ విక్టరీ.. నాలుగు ఓవర్ల లోనే మ్యాచ్ ఫినిష్

IND Vs UAE : కుల్దీప్ అరాచ‌కం..ఒకే ఓవ‌ర్ లో 3 వికెట్లు…కుప్ప‌కూలిన యూఏఈ

Boycott IND vs PAK : టీమిండియా, పాక్ మ్యాచ్ బాయ్ కాట్‌…కార‌ణం ఇదే

IND vs UAE, Asia Cup 2025: టాస్ గెలిచిన టీమిండియా…ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే

IND vs PAK: టీమిండియా, పాకిస్థాన్ మ్యాచ్ కు బిగ్ షాక్‌..చూసేవాడే క‌రువ‌య్యాడు.. ఒక్క టికెట్ కూడా సేల్ కాలేదు..!

T20 World Cup 2026 : 2026 టి20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఇదే… ఫైనల్ అక్కడే… పాకిస్తాన్ లేకుండానే!

Big Stories

×